Chicago Mass Shooting: అమెరికాలో మళ్లీ తుపాకుల మోతతో దద్దరిల్లింది. దేశ స్వాతంత్య్ర దినం సందర్భంగా సోమవారం ఉదయం చికాగో నగర శివారులోని ఐలాండ్ పార్కు వద్ద జరిగిన పరేడ్‌పై ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఆరుగరు మృతి చెందారు. 36 మంది గాయపడ్డారు.






వేడుకల్లో


ఇండిపెండెన్స్‌ డే సందర్భంగా ఏర్పాటు చేసిన పరేడ్‌ లక్ష్యంగా దుండగుడు కాల్పులు చేశాడు. కాల్పుల సమయంలో పరేడ్‌ను చూసేందుకు జనం భారీగా వచ్చారు. దీంతో క్షతగాత్రుల సంఖ్య ఇంకా పెరగవచ్చని అధికారులు తెలిపారు. కాల్పులతో భయాందోళనకు గురైన జనాలు ఒక్కసారిగా పరుగులు తీశారు. 


నిందితుడు అరెస్ట్


ఘటన జరిగిన వెంటనే నిందితుడి కోసం పోలీసులు జల్లెడ పట్టారు. అనుమానితుడు 22 ఏళ్ల రాబర్ట్‌ క్రిమోగా గుర్తించి అరెస్టు చేశారు. అతను హైపవర్‌ రైఫిల్‌తో వేడుకలకు వచ్చిన ప్రేక్షక్షులనే లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో పిల్లలతో సహా దాదాపు రెండు డజన్ల మందికి పైగా గాయపడ్డారని, ఆరుగురు మృతి చెందారని వెల్లడించారు. ప్రస్తుతం వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, కొందరి పరిస్థితి మాత్రం విషమంగా ఉందన్నారు.


బైడెన్ విచారం 




ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తాను తుపాకీ హింసకు వ్యతిరేకంగా పోరాడతానని వెనక్కి తగ్గేదేలేదని బైడెన్‌ అన్నారు.


Also Read: SpiceJet Emergency Landing: స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక లోపం- పాకిస్థాన్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్!


Also Read: Mainpuri UP: సహనం కోల్పోయి పోలీసుపై యువకుడి దాడి- వీడియో వైరల్