SpiceJet Emergency Landing: స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక లోపం- పాకిస్థాన్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్!

ABP Desam Updated at: 05 Jul 2022 01:41 PM (IST)
Edited By: Murali Krishna

SpiceJet Emergency Landing: దుబాయ్ వెళ్తోన్న స్పైస్‌జెట్ విమానం పాకిస్థాన్‌లో అత్యవసర ల్యాండింగ్ చేశారు.

(Image Source: PTI)

NEXT PREV

SpiceJet Emergency Landing: దిల్లీ నుంచి దుబాయ్ వెళ్తున్న స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పాకిస్థాన్ కరాచీ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.


ప్రమాదం లేదు 






స్పైస్‌జెట్‌ B737 ఎయిర్‌క్రాఫ్ట్ ఆపరేటింగ్ ఫ్లైయిట్‌లో ఇండికేటర్ లైట్ సరిగా పనిచేయకపోవడంతో కరాచీలో సాధారణ ల్యాండింగ్ చేసినట్లు ఆ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించారు. 







ఎమర్జెన్సీ ఏం లేదు, విమానం సాధారణ ల్యాండింగ్ చేశారు. విమానం బయలుదేరే ముందు ఎలాంటి ఇబ్బందులు లేవు. ప్రయాణికుల కోసం మరో విమానాన్ని కరాచీకి పంపించాం. వారిని అక్కడి నుంచి దుబాయ్ చేరుస్తాం.                                                          - స్పైస్‌జెట్ ప్రతినిధి


డీజీసీఏ దర్యాప్తు


స్పైస్‌జెట్‌ ఘటనపై డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) స్పందించింది. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు పేర్కొంది.


Also Read: Mainpuri UP: సహనం కోల్పోయి పోలీసుపై యువకుడి దాడి- వీడియో వైరల్


Also Read: Covid Update: దేశంలో కొత్తగా 13,086 కరోనా కేసులు- 19 మంది మృతి

Published at: 05 Jul 2022 01:26 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.