Covid Update: దేశంలో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గింది. కొత్తగా 13,086 కరోనా కేసులు నమోదయ్యాయి. 19 మంది మృతి చెందారు. తాజాగా 12,456 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 


రికవరీ రేటు 98.53 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసులు 0.26 శాతం ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 2.90 శాతానికి చేరింది.







  • మొత్తం కేసులు: 4,35,31,650

  • ‬మొత్తం మరణాలు: 5,25,242

  • యాక్టివ్​ కేసులు: 1,14,475

  • మొత్తం రికవరీలు: 4,28,91,933


వ్యాక్సినేషన్







దేశంలో తాజాగా 11,44,805 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,98,09,87,178కు చేరింది. మరో 4,51,312 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.


కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం.. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా నిబంధనలను తప్పకుండా పాటించేలా చూడాలని తెలిపింది. కరోనా టెస్టులను పెద్ద ఎత్తున నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. మాస్కులు తప్పనిసరిగా వినియోగించాలని కోరింది. మరోవైపు వ్యాక్సినేషన్ కార్యక్రామాన్ని కూడా వేగంగా కొనసాగించాలని నిర్ణయించింది కేంద్ర ఆరోగ్య శాఖ.


Also Read: Assam Floods: ఆ వరదలు కావాలని సృష్టించినవే- తాజాగా ఇద్దరు అరెస్ట్!



Also Read: No Service Charge : సర్వీస్ చార్జ్ వసూలు చట్ట విరుద్దం - ఇక బిల్లు చెల్లించేటప్పుడు ఓ సారి చూసుకోండి !