Gay Couple ties the knot in Kolkata: విదేశాలలో ఇదివరకే కొనసాగుతున్న సేమ్ సెక్స్ మ్యారేజ్ (Same Sex Marriage) సంప్రదాయం ఇప్పుడు భారత్‌లోనూ ఊపందుకుంది. కొందరైతే సెల్ఫ్ మ్యారేజ్ అంటూ మరో విడ్డూరాన్ని కూడా తెరమీదకి తెచ్చారు. గత నెలలో ఓ యువతి తనకు తాను మ్యారేజ్ చేసుకోవడంతో పాటు గోవాకు హనీమూన్‌కు వెళ్లింది. ఇదంతా ఎందుకంటారా. తాజాగా ఇద్దరు పురుషులు అంగరంగ వైభవంగా పెద్దల ఆశీర్వాదంతో వివాహం చేసుకుని ఔరా అనిపించారు. ఈ వివాహానికి కోల్‌కతా వేదికగా మారింది. పెద్దలు, అతిథుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరగడం విశేషం. 


అంగరంగ వైభవంగా వివాహం..
అభిషేక్ రే కోల్‌కతాలో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్. చైతన్య డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్‌పర్ట్. ఇతడు గురుగ్రామ్‌లో జాబ్ చేస్తున్నాడు. తాము ఒకరంటే మరొకరికి చాలా ఇష్టమని, తమ ప్రేమను కొత్త బంధంగా మలుచుకోవాలనుకున్నారు. కుటుంబసభ్యులను ఒప్పించి అభిషేక్, చైతన్య జూన్ 3న ఘనంగా వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లిలో అభిషేక్ ధోతీ ధరించి..  కుర్తాలో సాంప్రదాయ బెంగాలీ వరుడిలా కనిపించగా, చైతన్య శర్మ షేర్వాణీ ధరించారు. 200 మంది అతిథుల సమక్షంలో పెద్దల ఆశీర్వదంతో విరి వివాహం ఘనంగా జరిగింది. మంగళ స్నానాలు, మేళ తాళాలతో   స్వలింగ జంట ఆనందంతో వేడుకను జరుపుకుంది. ఒకరి మెడలో మరొకరు పూల దండలు వేసుకుని.. వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ వివాహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను వరుడిగా చెప్పుకుంటున్న చైతన్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయగా వైరల్‌ అయ్యాయి.


ఫేస్‌బుక్‌లో పరిచయం, ఆపై మనసులు కలిశాయి..
అభిషేక్, చైతన్యలు చాలా కాలం నుంచి ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్స్‌గా ఉన్నారు. వీరిద్దరూ తొలిసారి కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో ఒకరినొకరు నేరుగా కలుసుకున్నారు. 2020లో సెప్టెంబర్‌లో లాక్‌డౌన్ సమయంలో తన బర్త్‌డే సందర్భంగా కేక్ కటింగ్ సెలబ్రేషన్ ఫొటోలను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేయగా వాటిని చైతన్య చూశాడని అభిషేక్ తెలిపారు. ఆ ఫొటోలో కొందరు చిన్న పిల్లలు కనిపించగా.. వారు తన పిల్లలు అని చైతన్య భావించాడని చెప్పారు. ఆ తరువాత అసలు విషయం తెలిసి తాను నవ్వుకున్నానని, మేం రెగ్యూలర్‌గా సోషల్ మీడియాలో ఛాటింగ్ చేసేవాళ్లమని తెలిపాడు అభిషేక్. 


అభిషేక్ స్థానిక మీడియాలో మాట్లాడుతూ.. అక్టోబర్ నెల నుంచి మేం వ్యక్తిగత విషయాలు షేర్ చేసుకోవడం మొదలుపెట్టాం. మాది ఫ్రెండ్‌షిప్ కాదు, అంతకుమించి అనేలా బంధం మానసికంగా బలపడింది. కేంద్రం విమాన సర్వీసులు పునరుద్ధరించాక ఓ రోజు టికెట్ బుక్ చేసి చైతన్య నాకు సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఇంకో విషయం ఏంటంటే.. మేం కేవలం ఫేస్‌బుక్ మెస్సెంజర్ ద్వారానే ఛాటింగ్ చేసేవాళ్లమని, కనీసం మా కాంటాక్స్ నెంబర్స్ కూడా ఇచ్చిపుచ్చుకోలేదు. చైతన్యను కలుసుకున్నాక నా జీవితం మారిపోయింది. రెండు రోజుల వీకెండ్ ట్రిప్ కోసం వస్తున్నానని చెప్పాడు. కానీ ఏకంగా రెండు వారాల ట్రిప్ ఎంజాయ్ చేశాం. నేను చైతన్యను చాలా మిస్సయ్యాను. దాంతో గురుగ్రామ్ వెళ్లి అతడి కుటుంబాన్ని కూడా కలిశాను. 


తాజ్ మహల్ సాక్షిగా లవ్ ప్రపోజల్..
సినిమా సీన్ తరహాలో చైతన్య నాకు ప్రపోజ్ చేశాడు. ప్రేమకు చిహ్నంగా భావించే తాజ్ మహల్ వద్ద మోకాళ్లపై నిల్చుని రింగ్ తొడుగుతూ తన ప్రేమను వ్యక్తం చేస్తూ చైతన్య లవ్ ప్రపోజ్ చేశాడు. నాకు సినిమాలంటే ఇష్టమని, అదే తీరుగా ప్రపోజ్ చేసి షాకిచ్చాడని అభిషేక్ తెలిపారు. పెళ్లి గురించి చాలా కష్టపడి మా పెద్దలను ఒప్పించగలిగాం. డిసెంబర్ నుంచి ప్లాన్ చేసుకుంటే జూలై 3న మా పెళ్లి కల నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది. అనుకున్నట్లుగానే హల్దీ వేడుక, వివాహం అన్నీ కమాక్ స్ట్రీట్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో కుటుంబసభ్యులు, అతిథుల సమక్షంలో చైతన్య, తాను వివాహ బంధంతో ఒక్కటయ్యామని అభిషేక్ చెప్పుకొచ్చారు.