Assam Floods: ఆ వరదలు కావాలని సృష్టించినవే- తాజాగా ఇద్దరు అరెస్ట్!

ABP Desam   |  Murali Krishna   |  05 Jul 2022 10:55 AM (IST)

Assam Floods: అసోంలో కృత్రిమ వరదలు సృష్టించిన కేసులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.

(Image Source: PTI)

Assam Floods: అసోం కాచార్ జిల్లాలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. బరాక్ నది కట్టను తెంచి తద్వారా సిల్‌చార్ నగరంలో వరదలు వచ్చేలా చేసిన కేసులో వీరిని అదుపులోకి తీసుకున్నారు.

వీరిని మిథు హుస్సేన్ లస్కర్, కాబుల్ ఖాన్‌గా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కాచార్ ఎస్పీ రమణ్‌దీప్ కౌర్ స్పష్టం చేశారు. అయితే ఈ వ్యవహారంలో వీరిద్దరి ప్రమేయం గురించి పూర్తి వివరాలు చెప్పేందుకు ఆమె నిరాకరించారు. ఈ కేసుపై పూర్తిగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

లస్కర్‌ను శనివారం అరెస్ట్ చేసిన పోలీసులు, కాబుల్ ఖాన్‌ను శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.

సీఎం వార్నింగ్

అసోంలో సంభవించిన వరదలు ప్రకృతి విపత్తు కాదని కృత్రిమమని అంతకుముందు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆరోపించారు. ఇందుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కాచార్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం సందర్శించారు. ఆ సమయంలో కాబుల్ ఖాన్.. వరదలను చిత్రీకరిస్తున్న వీడియోను స్థానికులకు సీఎం చూపించారు. అనంతరం పోలీసులు ఖాన్‌ను అరెస్ట్ చేశారు. వరదలకు మొత్తం ఆరుగురు వ్యక్తులు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
 
ఈ వ్యవహారంపై గువాహటిలో సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. అదనపు డీజీపీ (సీఐడీ) నేతృత్వంలో ఈ కేసుపై పూర్తి దర్యాప్తు జరుగుతుంది. ప్రత్యేక కార్యదళం ఈ దర్యాప్తును పర్యవేక్షిస్తుంది.                                                             - హిమంత బిశ్వ శర్మ, అసోం సీఎం
 
ఇదీ జరిగింది
 
కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బేతుకండి వద్ద కట్టను తెంచి తద్వారా వర్షపు నీరు బరాక్ నదిలోకి వెళ్లేలా చేసినట్లు పోలీసులకు మే 24న ఫిర్యాదు అందింది. ఇది సిల్‌చార్ నగరానికి 3 కిమీ దూరంలో ఉంది. 
 
ఆ తర్వాత భారీ వర్షాల కారణంగా జూన్‌లో నది ఉప్పొంగి సిల్‌చార్‌ నగరాన్ని ముంచెత్తింది. ఈ కారణంగా దాదాపు లక్ష మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
 
Also Read: Same Sex Marriage: అంగరంగ వైభవంగా లవ్ మ్యారేజ్ చేసుకున్న పురుషులు - తాజ్ మహల్ సీన్ వీరి ప్రేమకే హైలైట్
 
No Service Charge : సర్వీస్ చార్జ్ వసూలు చట్ట విరుద్దం - ఇక బిల్లు చెల్లించేటప్పుడు ఓ సారి చూసుకోండి !
Published at: 05 Jul 2022 10:49 AM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.