ABP  WhatsApp

Mainpuri UP: సహనం కోల్పోయి పోలీసుపై యువకుడి దాడి- వీడియో వైరల్

ABP Desam Updated at: 05 Jul 2022 12:20 PM (IST)
Edited By: Murali Krishna

Mainpuri UP: ఓ యువకుడు పోలీసుపై దాడికి దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

(Image Source: Twitter/ANI)

NEXT PREV

Mainpuri UP: 


ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ యువకుడు సహనం కోల్పోయిన పోలీసు అధికారిపైనే దాడికి దిగాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.


ఇదీ జరిగింది






మెయిన్‌పురి పోలీస్‌స్టేషన్‌లో ఓ కేసుకు సంబంధించి కౌన్సిలింగ్ కోసం ఓ యువకుడ్ని పోలీసులు స్టేషన్‌కు రప్పించారు. అయితే పోలీసు అధికారి మాట్లాడుతోన్న సమయంలో ఆ యువకుడు దుర్భాషలాడాడు. అంతటితో ఆగకుండా ఆ అధికారిపై పిడిగుద్దులతో రెచ్చిపోయాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించినా, ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు ఆ యువకుడు. 


అక్కడున్న లేడీ పోలీసు కుర్చీతో అడ్డుకునేందుకు యత్నించగా ఆమెపై కూడా చేయి చేసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే ఎట్టకేలకు ఇతర పోలీసుల సాయంతో ఆ యువకుడ్ని అడ్డుకున్నారు. అనంతరం అదుపులోకి తీసుకున్నారు.


మతిస్థిమితం లేదు 






అయితే ఈ ఘటనపై మెయిన్‌పురి ఏఎస్‌పీ స్పందించారు. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.



నిందితుడ్ని గృహ హింస కేసులో కౌన్సిలింగ్ నిమిత్తం పిలిచాం. అయితే ఆ వ్యక్తి.. పోలీసుపైనే దాడికి దిగాడు. అందుకే కేసు పెట్టి అరెస్ట్ చేశాం. అయితే ఆ వ్యక్తిని మతిస్థిమితం సరిగా లేదని కుటుంబ సభ్యులు చెప్పారు. సదరు డాక్యుమెంట్లు అధికారులకు సమర్పిస్తే అవి పరిగణలోకి తీసుకుంటాం. -                                                                  పోలీసు అధికారి


Also Read: Covid Update: దేశంలో కొత్తగా 13,086 కరోనా కేసులు- 19 మంది మృతి


Also Read: Assam Floods: ఆ వరదలు కావాలని సృష్టించినవే- తాజాగా ఇద్దరు అరెస్ట్!

Published at: 05 Jul 2022 12:18 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.