Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌లో రష్యా మారణకాండ కొనసాగుతోంది. తాజాగా తూర్పు ఉక్రెయిన్‌లోని ఓ పాఠశాలపై రష్యా సైన్యం బాంబు దాడి చేసింది. ఈ దాడిలో 60 మంది వరకు చనిపోయారు.






దారుణం


లుహాన్సక్​లోని బిలోహోర్వికా ప్రాంతంలో ఉన్న పాఠశాలపై రష్యా సైనికులు బాంబు దాడి చేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో భవనంలో 90 మంది ఉండగా 27 మందిని మాత్రమే సురక్షితంగా బయటకు తీసుకురాగలిగిన్నట్లు లుహాన్సక్‌ గవర్నర్ తెలిపారు.


విజయోత్సాహం


రెండో ప్రపంచ యుద్ధంలో నాజీల మీద సాధించిన విజయానికి గుర్తుగా ప్రతి ఏడాది మే 9న రష్యాలో విజయ దినోత్సవం జరుపుకుంటారు. దీంతో అదే రోజున పుతిన్‌ సేనలు తమపై మరింతగా విరుచుకుపడే అవకాశం ఉందని ఉక్రెయిన్ తెలిపింది. దీంతో ఉక్రెయిన్‌ బలగాలు అప్రమత్తమయ్యాయి.


మేరియుపొల్‌ నగరంపై రెండ్రోజులుగా దాడుల తీవ్రత పెరగడంతో అక్కడ బలగాలను కట్టుదిట్టం చేశాయి. ఈ రెండ్రోజుల్లో రష్యా మరింతగా విరుచుకుపడే అవకాశం ఉందని భావిస్తోంది. ఈ అంచనాలను నిజం చేస్తూ రష్యా బాంబు దాడులతో ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తోంది. 


భద్రతా మండలి


మరోవైపు ఉక్రెయిన్‌లో శాంతి, భద్రతలకు సంబంధించిన పరిస్థితులపై ఐరాస భద్రతా మండలి ఆందోళన వ్యక్తంచేసింది. శాంతియుత పరిష్కారాన్ని కనుగొనాలని సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు పలికింది. ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేసింది. యుద్ధం మొదలయ్యాక ఇలాంటి ప్రకటన వెలువడడం ఇదే తొలిసారి. యుద్ధం, ఘర్షణ అనే పదాలను వాడకుండా.. ఐరాసలోని సభ్య దేశాలన్నీ వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని హితవు పలికింది.


Also Read: Navneet Rana On Uddhav Thackeray: దమ్ముంటే నాపై పోటీకి రండి- ఏ సెంటరైనా ఓకే: నవనీత్ రాణా


Also Read: Rahul Gandhi on LPG Price Hike: 'ఇప్పుడు ఒకటొస్తే, అప్పుడు రెండొచ్చేవి'- మోదీకి రాహుల్ గాంధీ కౌంటర్