ABP  WhatsApp

Navneet Rana On Uddhav Thackeray: దమ్ముంటే నాపై పోటీకి రండి- ఏ సెంటరైనా ఓకే: నవనీత్ రాణా

ABP Desam Updated at: 08 May 2022 03:33 PM (IST)
Edited By: Murali Krishna

Navneet Rana On Uddhav Thackeray: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు దమ్ముంటే తనపై పోటీ చేయాలని అమరావతి ఎంపీ నవనీత్ రాణా సవాల్ చేశారు.

దమ్ముంటే నాపై పోటీ చెయ్- ఏ సెంటరైనా ఓకే: నవనీత్ రాణా

NEXT PREV

Navneet Rana On Uddhav Thackeray:


మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు అమరావతి ఎంపీ నవనీత్ రాణా సవాల్ విసిరారు. దమ్ముంటే తనపై పోటీ చేయాలని, రాష్ట్రంలో ఏ నియోజకవర్గమైనా ఫర్వాలేదన్నారు. హనుమాన్ చాలీసా వివాదంలో అరెస్ట్ అయిన నవనీత్ ఇటీవల జైలు నుంచి విడుదలయ్యారు.



నేను ఏ తప్పు చేశానని నన్ను జైల్లో పెట్టారు? హనుమాన్ చాలీసా చదవడం తప్పా? హనుమాన్ చాలీసా చదవడం నేరమైతే 14 రోజులు కాదు 14 ఏళ్లైనా జైలుకెళ్లేందుకు సిద్ధం. దమ్ముంటే సీఎం ఉద్ధవ్ ఠాక్రే నాపై పోటీ చేసి గెలవాలి. రాష్ట్రంలో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా ఫర్లేదు. మహిళా శక్తి అంటే ఏంటో ఠాక్రేకు చూపిస్తా.                                                                     - నవనీత్ రాణా, అమరావతి ఎంపీ 


ఇదే వివాదం


మహారాష్ట్ర సీఎం నివాసం అయిన మాతోశ్రీ ముందు హనుమాన్ చాలీసా పఠిస్తానని నవనీత్ కౌర్ సవాల్ చేశారు. ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అయిన తర్వాత మహారాష్ట్రలో భయానక వాతావరణం పెరిగిందని, అందుకే  "మాతో శ్రీ " ఎదుట హనుమాల్ చాలీసా పఠిస్తానని ఆమె అన్నారు. 


నవనీత్ కౌర్ భర్త రవి రాణా కూడా ఎమ్మెల్యేనే. ఆయనతో కలిసి హనుమాన్ చాలీసా పఠించేందుకు వెళ్లక ముందే  శివసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున ముంబయిలోని వారింటి ముందు ఆందోళనకు దిగారు. శివసేనతో పోరాడుతూండటంతో కేంద్రం ఆమెకు వై కేటగిరి భద్రత కల్పించింది. 


రాణా దంపతులకు అధికార శివసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శివసేనను సవాల్‌ చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, మహారాష్ట్రలో మీరు ప్రశాంతంగా గడపలేరంటూ శివసేన పార్టీ అధికార ప్రతినిధి సంజయ్‌ రౌత్‌ హెచ్చరించారు.


ఆ తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి నవీనీత్ కౌర్ దంపతులను కోర్టులో హాజరు పరచగా వీరిద‍్దరికీ మే 6 వ‌ర‌కూ జుడీషియ‌ల్ రిమాండ్ విధిస్తున్న‌ట్లు బాంద్రా మెట్రో పాలిట‌న్ మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలిచ్చింది. అయితే వీరిద్దరికీ బుధవారం కోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో గురువారం కొన్ని గంటల వ్యవధిలో విడుదలయ్యారు.


Also Read: Rahul Gandhi on LPG Price Hike: 'ఇప్పుడు ఒకటొస్తే, అప్పుడు రెండొచ్చేవి'- మోదీకి రాహుల్ గాంధీ కౌంటర్


Also Read: Tamil Nadu CM Stalin: సిటీ బస్సులో సీఎం- నిల్చొనే ప్రయాణం, షాకైన జనం!

Published at: 08 May 2022 03:21 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.