Tamil Nadu CM Stalin:
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరోసారి తన సింప్లిసిటీని చూపించారు. సిటీ బస్సు ఎక్కి సందడి చేశారు. ముఖ్యమంత్రి బస్సు ఎక్కడంతో ప్రయాణికులంతా ఆశ్చర్యపోయారు.
ఇదీ జరిగింది
శనివారం ఉదయం మంత్రులతోపాటు శాసనసభ సమావేశాల్లో పాల్గొనేందుకు స్టాలిన్ పయనమయ్యారు. మైలాపూరు రాధాకృష్ణన్ రోడ్డులో వెళుతున్నప్పుడు ఉన్నట్టుండి కారులో నుంచి కిందకు దిగి ఆ చోట నిలిచి వున్న 29సీ సిటీ బస్సులో కాసేపు ప్రయాణం చేసి వస్తానని మంత్రులకు తెలిపారు. దీంతో మంత్రులంతా అక్కడి నుంచి వెళ్ళిపోయారు.
ఆ తర్వాత స్టాలిన్ సిటీ బస్సెక్కారు. స్టాలిన్‌ను చూసి ఆశ్చర్యపోయిన ప్రయాణికులు 'సీఎం వర్ధిల్లాలి' అంటూ నినాదాలు చేశారు. అదే సమయంలో ఆ బస్సులో ఉచితంగా ప్రయాణిస్తోన్న మహిళలను ఆయన ఆప్యాయంగా పలకరించారు. పలువురు మహిళలు, విద్యార్థినులు ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీపడ్డారు.
గుర్తుకొస్తున్నాయి
తన బస్సు ప్రయాణం గురించి స్టాలిన్ శాసనసభలో ప్రస్తావిస్తూ 29సీ సిటీ బస్సును తన జీవితంలో ఎన్నడూ మరచిపోలేనన్నారు.
ఏడాది పూర్తి
డీఎంకే ప్రభుత్వం ఏర్పడి శనివారంతో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా తన ఇంటి నుంచి తండ్రి కరుణానిధి నివసించిన గోపాలపురంలోని ఇంటికి స్టాలిన్ వెళ్లారు. ఇంట్లోని కరుణానిధి చిత్రపటం వద్ద నివాళులర్పించారు. తల్లి దయాళుఅమ్మాళ్‌కు నమస్కరించి ఆశీర్వాదం అందుకున్నారు.
Also Read: Khalistani Flags: అసెంబ్లీపై ఖలిస్థాన్ జెండాలు- సీఎం సీరియస్, దర్యాప్తు షురూ
Also Read: Badrinath Dham: బద్రీనాథుడి దర్శనానికి సిద్ధమా? తెరుచుకున్న ఆలయ తలుపులు