Badrinath Dham:
బద్రీనాథ్ ఆలయం సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి తెరుచుకుంది. ఆదివారం ఉదయం 6.15 గంటలకు వేద మంత్రాల మధ్య తలుపులు తెరిచారు. తొలి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఉత్తరాఖండ్‌లోని పవిత్ర పుణ్యక్షేత్రాల్లో బద్రీనాథ్ ఒకటి.
డోలీ
కుబేరుడి డోలీ శనివారం రాత్రి బామణి గ్రామానికి చేరుకుంది. ఆదివారం ఉదయం 5 గంటలకు బద్రీనాథుడి ఆలయానికి తీసుకొచ్చారు. బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ అధ్యక్షుడు అజేంద్ర అజయ్ సహా ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆలయాన్ని 15 క్వింటాళ్ల వివిధ రకాల పూలతో అలంకరించారు.
భారీ బందోబస్తు
ఈ కార్యక్రమం కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చార్‌ధామ్ యాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బలగాలను హైఅలర్ట్‌లో ఉంచారు. చమోలీ జిల్లాలో ముగ్గురు కమిషనర్లు, 9 మంది ఇన్‌స్పెక్టర్లు, 26 మంది సబ్ ఇన్స్‌పెక్టర్లను ప్రభుత్వం మోహరించింది. వీరితో పాటు ఎస్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది కూడా ఉన్నారు. ఈ మేరకు చమోలీ ఎస్‌పీ శ్వేత చౌబే పేర్కొన్నారు.
చార్‌ధామ్ యాత్ర
చార్‌ధామ్ యాత్రలో భాగమైన గంగోత్రి, యమునోత్రి ఆలయాలు ఈనెల 3వ తేదీన, కేదార్‌నాథ్ ఆలయం ఈనెల 6వ తేదీనే తెరుచుకున్నాయి. ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్, కేదార్‌నాథ్, యమునోత్రి, గంగోత్రిలను కలిపి చార్‌ధామ్‌లుగా పిలుస్తారు. ఈ ఆలయాలు సంవత్సరంలో ఆరు నెలలు మంచుతో మూసుకుపోయి ఉంటాయి. వేసవి నుంచి ఆరు నెలలు మాత్రమే భక్తులు సందర్శించుకునేందుకు వీలుంటుంది.
Also Read: Coronavirus Cases India: కొత్తగా 3,451 కరోనా కేసులు నమోదు- 40 మంది మృతి
Also Read: Viral Video: లోకో పైలట్ చేసిన పనికి కేంద్ర మంత్రి ఫిదా! సోషల్ మీడియాలో వీడియో వైరల్