Coronavirus Cases India:
దేశంలో రోజువారి కరోనా కేసులు 3వేలకు పైనే నమోదవతున్నాయి. కొత్తగా 3,451 కరోనా కేసులు నమోదుకాగా 40 మంది మృతి చెందారు. 3,079 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
మొత్తం కేసుల సంఖ్య 4,31,02,194కు చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 20,303గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.05గా ఉంది.
రికవరీ రేటు 98.74కు పెరిగింది. డైలీ కొవిడ్ పాజిటివిటీ రేటు 0.96గా ఉంది. వీక్లీ పాజిటివిటీ రేటు 0.83గా ఉంది.
వ్యాక్సినేషన్
శనివారం 17,39,403 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,90,20,07,487కు చేరింది. నిన్న ఒక్కరోజే 3 లక్షల 60 వేలకుపైగా కరోనా టెస్టులు నిర్వహించారు.
దిల్లీ, మహారాష్ట్ర
దిల్లీలో కొత్తగా 1,407 కరోనా కేసులు నమోదయ్యాయి. ముందు రోజుతో పోలిస్తే కరోనా కేసుల్లో 15 శాతం తగ్గుదల కనిపించడం కాస్త ఊరటనిస్తోంది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 5,955గా ఉంది. పాజిటివిటీ రేటు 4.72కు తగ్గింది.
మహారాష్ట్రలో కొత్తగా 253 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకరు కరోనాతో మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 78,79,054కు చేరింది. మరణాల సంఖ్య 1,47,846కు పెరిగింది.
ఒక్క ముంబయిలోనే కొత్తగా 172 కరోనా కేసులు వచ్చాయి.
Also Read: Viral Video: లోకో పైలట్ చేసిన పనికి కేంద్ర మంత్రి ఫిదా! సోషల్ మీడియాలో వీడియో వైరల్