Rahul Gandhi on LPG Price Hike:
ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి ఫైర్ అయ్యారు. వంట గ్యాస్ (ఎల్‌పీజీ) సిలిండర్ ధరపై రూ.50 పెరగడంంతో ఎన్‌డీఏ సర్కార్‌ను విమర్శిస్తూ ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో వంట గ్యాస్ సిలిండర్ ధరలను, ప్రస్తుత ఎన్‌డీఏ ప్రభుత్వ పాలనలో ధరలతో పోల్చి చూపిస్తూ రాహూల్ గాంధీ ట్వీట్ చేశారు. వంట గ్యాస్‌కు రాయితీ ఇవ్వడంలో అప్పటి, ఇప్పటి ప్రభుత్వాల మధ్య తేడాను వివరించారు.
2 నెలల్లో రెండోసారి
ఎల్‌పీజీ సిలిండర్ ధర శనివారం మరో రూ.50 పెరిగింది. ఈ పెరుగుదలతో దాదాపు 28.9 కోట్ల కుటుంబాలు ఒక్కొక్క సిలిండర్ కోసం రూ.1,000కి పైగానే ఖర్చు చేయవలసి ఉంటుంది. రెండు నెలల్లో రెండోసారి ఈ ధరలు పెరగడంతో సామాన్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా ఇంధనం ధరలు పెరుగుతున్నాయని చమురు సంస్థలు చెప్తున్నాయి.
కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జీవాలా శనివారం కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. వంట గ్యాస్ సిలిండర్ ధరను రెండున్నర రెట్లు పెంచారన్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాలకు వంట గ్యాస్ అందనంత దూరానికి వెళ్లిపోయిందన్నారు. ఈ ధరలను 2014నాటి స్థాయికి తగ్గించాలని డిమాండ్ చేశారు.
Also Read: Tamil Nadu CM Stalin: సిటీ బస్సులో సీఎం- నిల్చొనే ప్రయాణం, షాకైన జనం!
Also Read: Khalistani Flags: అసెంబ్లీపై ఖలిస్థాన్ జెండాలు- సీఎం సీరియస్, దర్యాప్తు షురూ