US man moved to Bengaluru to open restaurant:  విదేశీలు మన దేశంలో వివిధ రకాల పనులు చేసుకుంటూ ఉంటే.. భారతీయులు వారితో సేవలు చేయించుకుటూ ఉండే సీన్లతో సూపర్ అనే సినిమాను ఉపేంద్ర తీశారు. ఇవాళ కాకపోతే రేపు అయినా ఈ సీన్ రిపీట్ అవుతుందన్న సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా నుంచి భారతీయుల రివర్స్ వలసలు కాకుండా నిజంగా అమెరికన్లే వచ్చి వ్యాపారాలు చేసుకుంటున్నారు. 

బెంగళూరుసు అమెరికాకు చెందిన ఓ యువకుడు వ్యాపారం పెట్టుకునేందుకు వచ్చాడు. బెర్ట్ ముల్లెర్  అనే యువకుడు 22 సంవత్సరాల వయసులో అమెరికా నుండి బెంగళూరుకు వచ్చాడు. అమెరికాలో ఉద్యోగాలు చేసుకోవడం కన్నా ఇండియాకు వచ్చి వ్యాపారం పెట్టుకోవడం బెటరని అుకున్నాడు. 2012లో 22 ఏళ్ల వయసులో  తన మొదటి రెస్టారెంట్‌ను ప్రారంభించాడు. మెల్లగా భారతీయుల్ని ఆకట్టుకున్నాడు. మంచి ఫుడ్ అందిస్తూ.. హోటళ్లను విస్తరిస్తూ పోయాడు. ఇ్పపుడు ఆ యువకుడి హోటల్ ఫ్రాంచైజీలు దేశవ్యాప్తంగా 103 ఉన్నాయి.  గత సంవత్సరం రూ. 196 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. మొదటి హోటల్ ప్రారంభిచినప్పటి  నుండి ముల్లెర్ భారతదేశాన్ని తన నివాసంగా చేసుకున్నాడు. అమెరికాకు తిరిగి వెళ్లాలని అనుకోవడం లేదు. 

అసలు అమెరికాకు మళ్లీ వెళ్లాలన్న ఆలోచన ఎప్పుడూ రాలేదని.. ముల్లెర్ చెబుతున్నారు. తాను  భారతదేశం  తనకు ఇల్లులా అనిపిస్తుందని అందుకే ఇంట్లో నుంచి వెళ్లాలని అనిపించదన్నారు. ముల్లెర్ 2010లో  కొన్ని దేశాలను పర్యటించారు. ఆ సమయంలో ఇండియాకు వచ్చాడు. ఇండియా అతన్ని బాగా ఆకర్షించింది.  జైపూర్‌లో బస చేసినప్పుడు  తోటి విద్యార్థులలో ఒకరు తమ మెక్సికన్ ఆహారాన్ని కుటుంబానికి అందించినప్పుడు వారు ఆహారాన్ని ఆస్వాదించడం చూసి ముల్లెర్ ఆశ్చర్యపోయాడు. అతను కూడా తాను అమెరికా నుండి తెచ్చిన ఆహారాన్ని కుటుంబానికి అందించాడు. కానీ వారు దానిని ఇష్టపడలేదు.              

అప్పుడే మెక్సికన్ వంటల రెస్టారెంట్ ఇండియాలో పెట్టాలనుకున్నారు. అప్పటికి అమెరికా వెళ్లిపోయి  డిగ్రీని పూర్తి చేసి, స్నేహితులు, కుటుంబ సభ్యుల నుండి దాదాపుగా రెండున్నర లక్షల డాలర్లతో ఇండియాకు వచ్చారు.  దక్షిణ కాలిఫోర్నియా-శైలి బురిటో రెస్టారెంట్ అయిన కాలిఫోర్నియా బురిటోను ప్రారంభించడానికి బెంగళూరుకు వెళ్లాడు. ఐటీ హబ్‌గా ఉండటం వల్ల చాలా మంది విదేశీ ఫుడ్ పై ఆసక్తి చూపిస్తారని.. బెంగళూరును ఎంచుకున్నాడు. ఆయన అంచనాలు తప్పు కాలేదు. ఈ రెస్టారెంట్ మొదటి సంవత్సరంలో దాదాపు  రూ.4 కోట్లు ఆదాయం సంపాదిచింది.  తర్వాత వరుసగా చెన్నై, హైదరాబాద్ , ఢిల్లీలో మరిన్ని ఔట్‌లెట్లు ప్రారంభించాడు.                       

కాలిఫోర్ని బుర్రిటో రెస్టారెంట్లు ఇప్పుడు అన్ని మాల్స్ లోనూ కనిపిస్తూ ఉంటాయి. పేరు కాలిఫోర్నియా ఉన్నా.. మెక్సికన్ ఫుడ్ ను ఎక్కువగా అందిస్తారు. పూర్తిగా ఆరోగ్య  ప్రణాళికల ప్రకారం ఉడక బెట్టిన విధంగా ఉండి ఆహారం అందించడంతో ఈ అమెరికన్ ఇండియాలో ఎంట్రపెన్యూర్ గా ఎదిగిపోయాడు.