రోజురోజుకు సంక్షోభం ముదురుతున్న వేళ శ్రీలంక(Sri Lanka) ప్రధానమంత్రి మహీంద్ర రాజపక్సే(Prime Minister Mahinda Rajapaksa ) రాజీనామా దిశగా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. పరిస్థితులు చక్కబడకపోగా.. మరింత జఠిలమవుతున్నప్పుడు పదవి నుంచి తప్పుకోవడమే ఉత్తమమని అధ్యక్షుడు గోటబయ రాజపక్సే(Gotabaya Rajapaksa) చేసిన అభ్యర్థనకు ప్రధానమంత్రి మహీంద్ర రాజపక్సే సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. 


ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం, ప్రెసిడెన్స్ హౌస్‌లో గోటబయ రాజపక్సే నేతృత్వంలో జరిగిన ప్రత్యేక క్యాబినెట్ సమావేశంలో రాజపక్సే తన నిర్ణయాన్ని చెప్పార. శ్రీలంక ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయడానికి మహింద రాజపక్స అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. 


దేశంలో కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ప్రధాని వైఫల్యం కారణంగా, తన పదవి రాజీనామా చేస్తున్నట్టు మంత్రివర్గానికి ప్రధానమంత్రి మహింద రాజపక్సే సమాచారం అందించారు. ఆయన రాజీనామాతో కేబినెట్ రద్దు కూడా అవుతుంది. శ్రీలంకలో కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభానికి తన రాజీనామా ఒక్కటే పరిష్కారం అయితే, అందుకు తాను సిద్ధంగా ఉన్నానని మహింద రాజపక్సే ప్రకటించారు.






ప్రజల నుంచి తీవ్ర నిరసనల మధ్య దేశంలో ఆర్థిక, రాజకీయ సంక్షోభాన్ని నిర్వహించడం తీవ్రమైన సమస్యగా మారిందని అంగీకరించినట్లు తెలుస్తుంది. ఈ సంక్షోభం కారణంగా దేశంలో పర్యాటకులు లేరని ఆయన అన్నారు. కర్మాగారాల మూసివేత సమస్యను మరింత జఠిలం చేసిందని అభిప్రాయపడ్డారు. 


 ప్రధాని పదవికి రాజీనామా చేయాలనే రాజపక్సె నిర్ణయాన్ని శ్రీలంక క్యాబినెట్ మంత్రులు అంగీకరించినట్లు రాజకీయ వర్గాలు చెప్పాయి. అయితే, దీన్ని వభేదించిన మంత్రి విలమవీర దిసనాయకే.. మహింద రాజపక్సే రాజీనామాతో సంక్షోభం నుంచి ఎదుర్కోదనే విషయం భవిష్యత్‌ తేలుస్తుందన్నారు. 


ప్రధానమంత్రి మహీందా రాజపక్సే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించనున్నారు. ఆ తర్వాత వచ్చే వారంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది. శ్రీలంక తీవ్రమైన ఆహారం, విద్యుత్ కొరతతో పోరాడుతోంది, పొరుగువారి నుంచి సహాయం కోరవలసి వస్తుంది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో టూరిజంపై ఆంక్షలు విధించడం వల్ల ఏర్పడిన విదేశీ మారకద్రవ్య కొరత కారణంగా మాంద్యం ఏర్పడింది. దేశం తగినంత ఇంధనం, గ్యాస్‌ను కొనుగోలు చేయలేకపోతోంది, అయితే ప్రజలు కనీస సౌకర్యాలు కూడా తీర్చలేకపోతోంది.