శ్రీలంకలో మరోసారి ఎమర్జెన్సీ విధిస్తూ ఆ దేశ అధ్యక్షుడు రాజపక్సే ప్రకటించారు.  భారీ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో ఆందోళన తీవ్రమవుతున్నాయి. అధ్యక్షుడి భవనాన్ని ముట్టడించేందుకు నిరసనకారులు చేస్తున్న ప్రయత్నాన్ని సైన్యం అట్టుకుంటోంది. పరిస్థితులు అదుపులోకి తీసుకొచ్చేందుకు ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు అధ్యక్షుడు ప్రకటించారు. 


శ్రీలంకలో ఏర్పడిన భారీ ఆర్థిక సంక్షోభంపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాందోళనలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. శుక్రవారం శ్రీలంక పార్లమెంటును ముట్టడించేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. పోలీసులు జోక్యం చేసుకొని విద్యార్థులను నిలువరించే ప్రయత్నం చేశారు. గ్యాస్‌ షెల్స్ వాడారు.వాటర్ గన్స్‌ను యూజ్ చేశారు. అయినా విద్యార్థులను ఆపడం వాళ్లకు చాలా కష్టతరమైంది. 


అన్ని వర్గాల ప్రజల నుంచి వస్తున్న విమర్శలు, ఆందోళనలతో తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లిపోతోంది ప్రభుత్వం. ఆర్థికంగా కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటి. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తున్న రాజపక్సే ప్రభుత్వం దిగిపోవాలని ప్రజాసంఘాలు, విద్యార్థులు, సామాన్య ప్రజలు డిమాండ్ చేస్తున్నాయి. న్యాయం కోసం పోరాడుతున్న ప్రజలపై కాల్పులు జరపడాన్ని తప్పుపడుతున్నాయి. 






ప్రజాగ్రహాన్ని గుర్తించిన ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నాయి. రాజపక్సే ప్రభుత్వంపై అభిశంసన తీర్మానాన్ని ఆయన సోదరుడు మహింద రాజపక్సే నేతృత్వంలోని ప్రతిపక్షం ప్రవేశ పెట్టింది. ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస, యునైటెడ్ పీపుల్స్ ఫోర్స్ నాయకుడు, స్పీకర్ మహింద యాపా అబేవర్ధనకు రెండు ప్రతిపాదనలు చేశారు. ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానంలో ప్రధాని, మంత్రులు ఆర్థిక పరిస్థితికి సమిష్టి బాధ్యత వహించడంలో విఫలమయ్యారని ఆరోపించారు.


22 మిలియన్ల జనాభా ఉన్న శ్రీలంక ప్రజలు చాలా నెలలుగా ఆహారం, ఇంధనం, మందుల కొరతతో పోరాడుతున్నారు. 1948లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఇది చాలా దారుణంగా ఉంది. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడంలో విఫలమైన ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోంది. ప్రభుత్వం రాజీనామా చేయాలంటూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.


శ్రీలంక స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి అతిపెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రజలు తీవ్రమైన విద్యుత్ కోతలతో పాటు నిత్యావసర వస్తువుల కొరతతో బాధపడుతున్నారు. సమస్యలు పరిష్కరించాలని లేకుంటే దిగిపోవాలని చెప్పి రాజపక్సే నివాసం వద్ద ప్రజలు ఆందోళన చేపట్టారు. దీంతో ఏప్రిల్ 1న ఎమర్జెన్సీ విధించారు. దాన్ని ఏప్రిల్ 5న ఉపసంహరించారు. మళ్లీ ఇప్పుడు పరిస్థితులు అదుపు తప్పుతున్నాయని ఎమర్జెన్సీ విధించారు.