రష్యా- ఉక్రెయిన్‌ మధ్య ఏర్పడిన ప్రచ్చన్న యుద్ధం తరహా పరిస్థితి ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తోంది. రష్యా  ( Russia ) ఎప్పుడైనా ఉక్రెయిన్‌పై ( Ukraine ) దాడికి పాల్పడవచ్చని.. యుద్దం రావొచ్చని ప్రపంచదేశాలు అంచనా వేస్తున్నాయి. అందుకే ముందు జాగ్రత్తగా ప్రత్యేక విమానాలతో తమ పౌరులను ఉక్రెయిన్ నుంచి వెనక్కి తిరిగి రప్పిస్తున్నాయి. భారత్ ( India ) కూడా ప్రత్యేక విమానాలను భారతీయుల కోసం ఏర్పాటు చేసింది. అయితే ఉక్రెయిన్ పౌరులు రష్యాలో ఉంటే తక్షణం వారంతా ఆ దేశాన్ని వదిలి పెట్టాలని ఉక్రెయిన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 



రష్యా ప్రభుత్వం ఉక్రెయిన్ పౌరులపై కక్ష సాధింపులకు పాల్పడుతుందన్న ఉద్దేశంతో లేదా యుద్ధం వస్తే ఉక్రెయిన్ రష్యాపై దాడులకు సిద్ధమైన కారణంగా ఈ ఆదేశాలు జారీ చేసినట్లుగా భావిస్తున్నారు. ఇప్పటికే  తూర్పు ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్‌ ప్రాంతంలో ఉక్రెయిన్ సైన్యం, రష్యా అనుకూల వేర్పాటు వాదులకు మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు జరుగుతున్నాయి. ఉక్రెయిన్‌లోని కొన్ని ప్రాంతాలను రష్యా ప్రత్యేకంగా గుర్తించింది. అక్కడి వేర్పాటు వాదులు రష్యాకు అనుకూలంగా ఉన్నారు. 


రష్యా యుద్ధ తంత్రం- భారత్ శాంతి మంత్రం- అమెరికా హెచ్చరికల పర్వం


దీంతో డొనియెస్కీ తో పాటు సమీప ప్రాంత వేర్పాటు వాద నేతలు  తమ ప్రాంతంలోని మహిళలు, వృద్ధులు, చిన్నారులను రష్యాకు తరలిస్తున్నట్ ప్రకటించారు., పెద్ద ఎత్తున తరలిస్తున్నారు కూడా.  వీరికి ఆశ్రయం కల్పించేందుకు రష్యా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. వేర్పాటు వాద ప్రాంతాల నుంచి ప్రజలు రష్యాకు వెళ్లకుండా ఉక్రెయిన్ ప్రభుత్వం కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. ఉక్రెయిన్ పౌరులు ఎవరూ రష్యాకు వెళ్లకుండా జాగ్రత్త పడటంతో పాటు వెళ్లిన వారిని మళ్లీ వెనక్కి వచ్చేలా చేయడం కోసం ఈ ప్లాన్ ను ఉక్రెయిన్ ప్రభుత్వం అమలు చేస్తున్నట్లుగా భావిస్తున్నారు.


8 ఏళ్ల గరిష్ఠం 100 డాలర్లకు ముడిచమురు - ఇక భారత్‌లో ధరల మోతే!


ఉక్రెయిన్‌కు నాటోలో సభ్యత్వం ఇస్తారని తెలిసిన వెంటనే రష్యా  అధ్యక్షుడు పుతిన్ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూ తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. చివరికి యుద్ధానికి కూడా సిద్ధమని సంకేతాలు పంపుతున్నారు. ఈ వివాదం ఇప్పుడు ఎలా పరిష్కారం అవుతుందా అని ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నాయి. యుద్దం తరహా పరిస్థితులు ఇప్పుడు అన్ని దేశాలపైనా ప్రభావం చూపిస్తున్నాయి.