Flying Object in Pakistan | ఓ వింత ఆకారం పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్ ప్రజలను కలవర పెట్టింది. దాదాపు 2 గంటల పాటు ఆకాశంలో చక్కర్లు కొట్టిన ఆ ఆకారం చూసి అంతా జుట్టు పీక్కున్నారు. ఉబ్బిన త్రిభుజాకారంలో ఉన్న ఆ వింత వస్తువును చూసి అంతా గ్రహాంతరవాసుల వాహనం(UFO) కావచ్చని భావించారు. 


ఆర్స్లాన్ వార్రైచ్ అనే 33 ఏళ్ల వ్యక్తి ఈ వింత ఆకారాన్ని రికార్డు చేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పగటి వేళ కావడంతో ఆ ఆకారం చాలా స్పష్టంగా వీడియోలో కనిపించింది. ఈ సందర్భంగా ఆర్స్లాన్ మాట్లాడుతూ.. ‘‘మొదట్లో దాన్ని చూడగానే గుండ్రని వస్తువులా కనిపించింది. జూమ్ చేసి చూస్తే ఉబ్బిన త్రిభుజాకారంలో కనిపించింది. అది ఏమిటనేది ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. అది నల్ల రంగులో ఉంది. పదునైన కొనలు కూడా ఏమీ లేవు. నేను దాదాపు 13 నిమిషాలపాటు దాన్ని షూట్ చేశాను. ఫొటోలు కూడా తీశాను. ఆ తర్వాత చీకటి పడటంతో అది మాయమైపోయింది’’ అని తెలిపాడు. ఇది సరిగ్గా ఇస్లామాబాద్‌లోని డీహెచ్ఏ 1 జిల్లా గగనతలంలో కనిపించింది. 


Also Read: ఉదయాన్నే శృంగారంలో పాల్గోవచ్చా? నిపుణులు ఏమంటున్నారు?


అయితే, అది డ్రోన్ కావచ్చేమో అనే సందేహాన్ని కూడా ఆర్స్లాన్ కొట్టిపడేశాడు. తాను ఎన్నో ఏళ్ల నుంచి డ్రోన్లు ఉపయోగిస్తున్నానని తెలిపాడు. పైగా, ఇస్లామాబాద్‌లో ఎంతోమంది వీఐపీలు ఉంటారు. కాబట్టి అక్కడ డ్రోన్లకు అనుమతి కూడా ఉండదని పేర్కొన్నాడు. మరి, ఇంతకీ అతడు చూసిన ఆకారం ఏమిటీ? నిజంగానే గ్రహాంతరవాసులు ఇస్లామాబాద్ మీదుగా ప్రయాణించారా? ఎంత సేపైనా అది ఆ గగనతలం నుంచి కదలకపోవడానికి కారణం ఏమిటీ? ఇలా చాలా సందేహాలు వెలువడుతున్నాయి. స్థానికులు కూడా ఆ వింత ఆకారం తమకు కూడా కనిపించిందని తెలిపారు.



మే 2021లో, అమెరికా నావికా దళానికి కూడా ఓ UFO కనిపించింది. ఆ నౌక సమీపం నుంచి వేగంగా దూసుకెళ్లిన UFO సముద్రంలో అదృశ్యమైంది. ఈ సంఘటనను శాన్ డియాగో తీరంలో ఉన్న USS ఒమాహా కంబాట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (CIC) కెమేరాలు రికార్డు చేశాయి. 


Also Read: ఈ నగరాల్లో నివసిస్తున్నారా? మీరు ఎంత సెక్స్ చేసినా ‘ఆ ఫలితం’ ఉండదు, కారణం ఇదే!