Sperm Quality | ఈ రోజుల్లో ఎంతోమంది సంతాన సమస్యలతో బాధపడుతున్నారు. ఇందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే, చాలా కేసుల్లో పురుషుల్లోనే లోపాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీర్యం నాణ్యంగా లేకపోవడం, పిల్లలు పుట్టేందుకు అవసరమైన స్పెర్మ్(శుక్రం) కౌంట్ తక్కువగా ఉండటమే కారణమని వైద్యులు చెబుతున్నారు. ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే.. ఎక్కువగా నగరాల్లో నివసించేవారిలోనే ఈ సమస్య ఉంటున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. ఎందుకంటే.. ఆయ నగరాల్లోని వాయు కాలుష్యం పురుషుల వీర్యంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.
ఇటీవల జమా నెట్‌వర్‌లో ‘అసోసియేషన్ ఆఫ్ ఎక్స్‌పోజర్ టు పార్టిక్యులేట్ మ్యాటర్ ఎయిర్ పొల్యూషన్ విత్ సెమెన్ క్వాలిటీ అమాంగ్ మెన్ ఇన్ చైనా’ పేరుతో ఓ స్టడీ ప్రచురితమైంది. అందులో పురుషుల స్పెర్మ్ కౌంట్‌పై పొల్యూషన్ ఏ స్థాయిలో ప్రభావం చూపుతుందో పేర్కొంది. నగరాల్లో పర్టిక్యులేట్ మ్యాటర్ స్థాయిలు తగ్గించడం ద్వారా పురుషుల్లో అస్తెనోజోస్పర్మియా ప్రమాదాన్ని తగ్గించడం ద్వారా సంతానోత్పత్తికి అవసరమైన స్పెర్మ్ కౌంట్ పెరిగేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని పరిశోధకులు సూచించడం గమన్నార్హం.
ఈ పరిశోధనల్లో భాగంగా 33,876 మందిపై స్డడీ నిర్వహించారు. దీనివల్ల వాయు కాలుష్యం పురుషుల సంతానోత్పత్తిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోగలిగారు. ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో ఈ స్టడీ మరింత కీలకంగా మారింది. ఇప్పటి నుంచే ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోతే ఈ సమస్య మరింత ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: మిలింద్ సోమన్‌ను చూశావా బేబమ్మా? ‘జపనీస్ ఫారెస్ట్ బాత్’తో ముసలోడే కావట్లేదట, ఇంతకీ ఏమిటదీ?
షెఫీల్డ్ విశ్వవిద్యాలయంలోని ఆండ్రాలజీ ప్రొఫెసర్ అలన్ పేసీ ది గార్డియన్ తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘వాయు కాలుష్యం వల్ల వీర్యం నాణ్యతకు ప్రమాదం ఉందని అనేక అధ్యయనాలలో సూచించారు. కానీ, స్పష్టమైన ఆధారాలు చూపించలేదు. తాజా అధ్యయనం ద్వారా అది రుజువైంది. ఇందుకు ఈ పరిశోధనలే ఆధారం’’ అని తెలిపారు. ఇది కేవలం చైనాకే పరిమితం అని మాత్రం అనుకోవద్దు. ఇండియాలోని ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలలో నివసిస్తున్నట్లయితే తప్పకుండా అప్రమత్తంగా ఉండాలి. ఈ నగరాల్లో కూడా వాయు కాలుష్యం తీవ్రస్థాయిల్లో ఉంది. ఇలాంటి కాలుష్య నగరాల్లో సంతానం కోసం ఎన్నిసార్లు సెక్స్ చేసినా ఫలితం ఉండదు. వీర్య నాణ్యత పెరగాలంటే.. మీరు కూడా కాలుష్యానికి దూరంగా ఉండాలి.
Also Read: తేలుతో స్పెషల్ సూప్, ఈ వీడియో చూసే ధైర్యం ఉందా? ఆరోగ్య ప్రయోజనాలు చాలానే ఉన్నాయట!