PM Modi on Ukraine Crisis: రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధంలో విజేతలు ఎవరూ ఉండరని, అందరూ నష్టపోతారని మోదీ అన్నారు. భారత్ మాత్రం శాంతి పక్షానే నిలుస్తుందని పునరుద్ఘాటించారు.
మూడు రోజుల ఐరోపా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం జర్మనీ చేరుకున్నారు. రాజధాని బెర్లిన్‌లో ఆ దేశ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్‌తో భేటీ అయ్యారు. వాణిజ్యానికి ప్రోత్సాహకాలతో పాటు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. 6వ ఇండియా- జర్మనీ గవర్నమెంటల్ కన్సల్టేషన్స్ (ఐజీసీ)లో ఒలాఫ్ స్కోల్జ్‌తో కలిసి మోదీ పాల్గొన్నారు. ప్రధానితో పాటు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ కూడా ఉన్నారు.
ఘన స్వాగతం
బ్రాండన్‌బర్గ్ విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఆ సమయంలో భారతీయ సంతతికి చెందిన ప్రజలు ప్రధాని మోదీతో ముచ్చటించారు. వందేమాతరం, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు
.ఆ తర్వాత అక్కడికి వచ్చిన చిన్నారులతో ప్రధాని నరేంద్ర మోదీ ముచ్చటించారు. ఓ బాలిక ప్రధానికి చిత్రపటాన్ని బహూకరించింది. ప్రధాని తనకు ఆదర్శమని తెలిపింది. మరో చిన్నారి మోదీకి దేభక్తి పాటను పాడి వినిపించాడు. మాతృభూమి గురించి ఆ చిన్నారి పాట పాడుతుంటే ప్రధాని మోదీ చిటికెలు వేశారు. అద్భుతంగా పాడావంటూ ఆ బాలుడ్ని మోదీ మెచ్చుకున్నారు.
Also Read: PM Modi Europe Tour: ఆ చిటికెలు చిటికెలు- మోదీ మనసు దోచిన చిన్నారి- ఏం పాడినవ్ రా బుడ్డోడా!
Also Read: Vladimir Putin's Health: పుతిన్ కీలక నిర్ణయం- అధికార పగ్గాలు అప్పగించి సర్జరీకి సిద్ధం!