PM Modi Europe Tour: ఐరోపా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం బెర్లిన్ చేరుకున్నారు. బ్రాండన్‌బర్గ్ విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఆ సమయంలో భారతీయ సంతతికి చెందిన ప్రజలు ప్రధాని మోదీతో ముచ్చటించారు. వందేమాతరం, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.
పాట పాడిన చిన్నారి
ఆ తర్వాత అక్కడికి వచ్చిన చిన్నారులతో ప్రధాని నరేంద్ర మోదీ ముచ్చటించారు. ఓ బాలిక ప్రధానికి చిత్రపటాన్ని బహూకరించింది. ప్రధాని తనకు ఆదర్శమని తెలిపింది. మరో చిన్నారి మోదీకి దేభక్తి పాటను పాడి వినిపించాడు.
మాతృభూమి గురించి ఆ చిన్నారి పాట పాడుతుంటే ప్రధాని మోదీ చిటికెలు వేశారు. అద్భుతంగా పాడావంటూ ఆ బాలుడ్ని మోదీ మెచ్చుకున్నారు.
ఐరోపా పర్యటన
పర్యటనలో భాగంగా మొదట బెర్లిన్‌లో జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్‌తో ద్వైపాక్షిక చర్చల్లో మోదీ పాల్గొంటారు. వీరిద్దరూ భారత్-జర్మనీ అంతర్ ప్రభుత్వ సంప్రదింపుల ఆరో ఎడిషన్‌కు సహ అధ్యక్షులుగా ఉన్నారు. 2021లో జర్మనీలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక ఇరువురు దేశాధినేతలు సమావేశం కానుండడం ఇదే తొలిసారి. ద్వైపాక్షిక చర్చల అనంతరం జర్మనీలోని భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు.
డెన్మార్క్
ఆ తర్వాత డెన్మార్క్ ప్రధాని మెట్టె ఫ్రెడరిక్సెన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ కోపెన్‌హాగన్‌కు వెళతారు. డెన్మార్క్ వేదికగా జరగనున్న ఇండియా- నార్డిక్ సమ్మిట్‌లో ఆయన పాల్గొంటారు. అనంతరం భారత్- డెన్మార్క్ బిజినెస్ ఫోరమ్‌లో మోదీ పాల్గొంటారు.
శుభాకాంక్షలు
ఆ తర్వాత తిరుగు ప్రయాణంలో ప్రధాని మోదీ కొద్దిసేపు పారిస్‌లో ఆగనున్నారు. నూతనంగా ఎన్నికైన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌ను కలిసి మోదీ శుభాకాంక్షలు తెలపుతారు.
Also Read: Vladimir Putin's Health: పుతిన్ కీలక నిర్ణయం- అధికార పగ్గాలు అప్పగించి సర్జరీకి సిద్ధం!
Also Read: Nand Mulchandani: అమెరికాలో మనోడికి అరుదైన గౌరవం- నిఘా సంస్థ సీటీఓగా నియామకం