Vladimir Putin's Health:
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ క్యాన్సర్ సర్జరీకి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఆయన సర్జరీ చేయించుకుని తిరిగి కోలుకునేవరకు అధికార పగ్గాలు మరొక వ్యక్తికి అప్పగించనున్నారట. ఆ దేశ నిఘా సంస్థ కేజీబీ మాజీ చీఫ్, నికోలాయ్ పట్రుషెవ్ (70)కి తాత్కాలికంగా అధికారాన్ని పుతిన్ అప్పగిస్తారని ఈ వార్తల సారాంశం.
అలా ఇవ్వొచ్చా?
రష్యా రాజ్యాంగం ప్రకారం అధికారాన్ని ప్రధాన మంత్రికి మాత్రమే అప్పగించాలి. దీనికి బదులుగా తనకు నమ్మకస్థుడైన పట్రుషెవ్‌కు తాత్కాలికంగా అధికారాన్ని పుతిన్ అప్పగించనుండటం ఆశ్చర్యకరంగా ఉన్నట్లు విశ్లేషణలు వస్తున్నాయి. సాధారణంగా అధికార బదిలీకి పుతిన్ ఒప్పుకోరని, అయితే శస్త్రచికిత్స ఉన్నందున కేవలం రెండు మూడు రోజులు పట్రుషెవ్‌కు తాత్కాలికంగా అధికారాన్ని ఆయన అప్పగిస్తారని రష్యా మీడియా వర్గాలు వెల్లడించాయి.
కీలక సమయంలో
పుతిన్ గత ఏడాదిన్నరగా ఉదర క్యాన్సర్‌తోపాటు పార్కిన్సన్‌తో బాధపడుతున్నట్లు సమాచారం. అయితే ఉదర క్యాన్సర్‌కు తప్పనిసరిగా చేయించు కోవాల్సిన శస్త్రచికిత్స వాయిదా పడుతూ వస్తుంది. ఏప్రిల్ 15 తర్వాత శస్త్రచికిత్సకు తొలుత షెడ్యూల్ ఖరారు చేసినట్లు సమాచారం. అయితే రెండో ప్రపంచ యుద్ధంలో రష్యా విజయాన్ని గుర్తు చేసుకునే విక్టరీ డేను మే 9న మాస్కోలోని రెడ్ స్క్వేర్‌లో నిర్వహించనున్నారు. దీంతో దీని తర్వాతే పుతిన్‌కు శస్త్రచికిత్స జరుగుతుందని భావిస్తున్నారు.
రష్యా భద్రతా మండలిలో ప్రస్తుత కార్యదర్శి అయిన పట్రుషెవ్‌కు యుద్ధ వ్యూహాలు రూపొందించడంలో మంచి పేరు ఉంది. దీంతో క్యాన్సర్ సర్జరీతోపాటు అనంతరం పుతిన్ కోలుకునే స్వల్ప కాలం వరకు రష్యా పగ్గాలతోపాటు ఉక్రెయిన్‌పై యుద్ధ కార్యాచరణ పట్రుషెవ్ చేతుల్లో పుతిన్ పెట్టనున్నారని సమాచారం.
Also Read: Corona Virus Cases: దేశంలో 5వ రోజూ 3వేల కరోనా కేసులు- 26 మంది మృతి