PM Modi Europe Tour: మూడు రోజుల యూరప్ పర్యటన - జర్మనీలో ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం, పలు దేశాధినేతలతో వరుస భేటీలు
PM Modi arrives in Germany: ఆదివారం అర్ధరాత్రి ఢిల్లీ నుంచి బయలుదేరిన ప్రధాని మోదీ జర్మనీ చేరుకున్నారు. జర్మనీ రాజధాని బెర్లిన్‌లో భారత ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది.
PM Modi Europe Tour: భారత ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజులపాటు యూరప్‌లో పర్యటించనున్నారు. ఆదివారం అర్ధరాత్రి ఢిల్లీ నుంచి బయలుదేరిన ప్రధాని మోదీ జర్మనీ చేరుకున్నారు. జర్మనీ రాజధాని బెర్లిన్‌లో భారత ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. నేడు బెర్లిన్‌లో జర్మనీ ఛాన్స్‌లర్ ఒలాఫ్ షాల్జ్‌తో భేటీ కానున్న మోదీ కానున్నారు. జర్మనీ, ఫ్రాన్స్, డెన్మార్క్‌లో ప్రధాని మోదీ 3 రోజుల టూర్లో భాగంగా పలు కీలక భేటీలలో పాల్గొంటారు.
జర్మనీ ఛాన్స్‌లర్‌తో భేటీ..
ప్రధాని మోదీ నేటి నుంచి మూడు రోజులపాటు యూరప్ పర్యటనలో భాగంగా పలు దేశాల అధినేతలతో కీలక విషయాలపై చర్చించనున్నారు. తన పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ప్రత్యేక విమానంలో మొదట జర్మనీ చేరుకున్నారు. బెర్లిన్ ఎయిర్‌పోర్టులో భారత ప్రధానికి జర్మనీ అధికారులు ఘన స్వాగతం పలికారు. నేడు జర్మనీ - భారత్ అంతర్గత వ్యవహారాలపై రాజధాని బెర్లిన్‌లో నిర్వహించనున్న 6వ సమావేశంలో జర్మనీ చాన్సలర్ ఒలాఫ్ షాల్జ్‌తో ప్రధాని మోదీ భేటీ అవుతారు.
యూరప్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ మొత్తం 25 సమావేశాల్లో పాల్గొంటారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్, డెన్మార్క్ ప్రధాని మెటె ఫెడరిక్సన్‌తో ద్వైపాక్షిక, రక్షణ సంబంధాలను గురించి ప్రధాని మోదీ చర్చించనున్నారు. రాఫెల్ యుద్ధ విమానాలు, ఫైటర్ జెట్స్‌ను భారత్ ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయడం తెలిసిందే. డెన్మార్క్‌లోని కొపెన్‌హేగన్‌లో జరుగనున్న భారత్-నార్డిక్ సదస్సులో డెన్మార్క్, ఐస్‌లాండ్, ఫిన్లాండ్, స్వీడన్, నార్వే దేశాల అధినేతలతో ప్రధాని మోదీ కీలక అంశాలపై భేటీ అవుతారు. ఏడు దేశాలకు చెందిన అధ్యక్షులు, ప్రధానులతో పాటు దాదాపు 50 మంది అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలతో మోదీ సమావేశం కానున్నారని తెలుస్తోంది.
Also Read: Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీ, బిహార్ నుంచి ప్రయాణం అంటూ ప్రకటన