కాంగ్రెస్ పార్టీతో చర్చలు బెడిసికొట్టడంతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీ స్థాపించనున్నారా? ఎందుకంటే ఆయన తాజాగా చేసిన తర్వాత ఈ ఊహాగానాలు జోరందుకున్నాయి. ప్రశాంత్ కిషోర్ సోమవారం ఉదయం ఓ ట్వీట్ చేస్తూ, ఇప్పుడు నిజమైన గురువులను అంటే ప్రజలకు చేరువ కావాల్సిన సమయం ఆసన్నమైందని, ‘జన్ సూరజ్’ సమస్యలను, వారి మార్గాన్ని బాగా అర్థం చేసుకోవలసిన సమయం ఆసన్నమైందని ట్వీట్ చేశారు.
నిజానికి ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌లో చేరతారనే చర్చ చాలా కాలంగా సాగుతోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మెరుగైన పనితీరు గురించి ప్రశాంత్ కిషోర్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. అయితే కాంగ్రెస్, ప్రశాంత్ కిషోర్ మధ్య చర్చలు ఫలించకపోవడంతో ఆయన కాంగ్రెస్‌లో చేరలేదు.
ప్రశాంత్ కిషోర్ బీహార్ నుంచి తన ప్రయాణం ప్రారంభిస్తానని ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యంలో అర్ధవంతమైన భాగస్వామిగా ఉండటం, ప్రజా అనుకూల విధానాన్ని రూపొందించడంలో సహాయపడటం కోసం సిద్ధమవుతున్నానని అన్నారు. ‘‘ఇప్పుడు ‘రియల్ మాస్టర్’ వద్దకు వెళ్లాల్సిన సమయం వచ్చింది. అంటే ప్రజలకు ఉన్న సమస్యలు, ప్రజలకు న్యాయం అందించే సరైన మార్గాన్ని బాగా అర్థం చేసుకోవడానికి రెడీ అవుతాను. ప్రయాణం బిహార్‌తో ప్రారంభం కానుంది.’’ అంటూ రాసుకొచ్చారు.
2024 సాధారణ ఎన్నికల కోసం కాంగ్రెస్‌లో చేరి పార్టీని బలోపేతం చేస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో అందులో చేరడం లేదని గత వారం పీకే ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన వారంలోపే తాజాగా కొత్త పార్టీ పెడుతున్నట్లుగా హింట్ ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. బిహార్ రాజకీయాలకు పీకే కొత్తేమీ కాదు. నితీష్ కుమార్ నాయకత్వంలోని జనతా దళ్ - యునైటెడ్ పార్టీకి ఆయన వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.