Corona Virus Cases:
దేశంలో కొవిడ్ ఉధృతి మళ్లీ క్రమంగా పెరుగుతోంది. వరుసగా ఐదో రోజు కూడా 3 వేలకు పైగా కొవిడ్ కేసులు నమోదు అయ్యాయి. దేశంలో కొత్తగా 3157 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 26 మంది మరణించారు.
- యాక్టివ్ కేసులు: 19,500
- మొత్తం మరణాలు: 5,23,869
- రికవరీలు: 4,25,38,976
- మొత్తం కేసులు: 4,30,82,345
ప్రస్తుతం దేశంలో 19,500 యక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశంలో యాక్టివ్ కేసుల శాతం 0.05గా ఉంది.
దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 4,30,82,345 కేసులు నమోదయ్యాయి. 5,23,869 మరణాలు సంభవించాయి. కరోనా రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. తాజాగా కరోనా నుంచి 2723 మంది కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా మొత్తం కోలుకున్న వారి సంఖ్య 4,25,38,976కు చేరింది.
ఫోర్త్ వేవ్
కరోనా ఫోర్త్ వేవ్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేసుల పెరుగుదల, జీనోమ్ సీక్వెన్సీ, ఇన్‌ఫెక్షన్ పెరుగుదల వంటి అంశాలపై ఎప్పటికప్పుడు కేంద్ర ఆరోగ్య శాఖ చర్చిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కేసుల పెరుగదల వేళ కరోనా నాలుగో దశ వచ్చే అవకాశం ఉందంటూ కేంద్రం, రాష్ట్రప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు.. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖ రాశారు. వైరస్ నిర్ధరణ పరీక్షలు పెంచడం, ట్రాక్ చేయడం, చికిత్స, వ్యాక్సినేషన్, కట్టడి చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు నిబంధనలు అమలు చేయాలని పేర్కొన్నారు.
Also Read: Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీ, బిహార్ నుంచి ప్రయాణం అంటూ ప్రకటన
Also Read: Weather Update: దక్షిణ అండమాన్ సముద్రంలో తుపాను, మే 5న ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు!