Weather Update: మే 5న అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) ఆదివారం తెలిపింది. మే 4 నాటికి దక్షిణ అండమాన్ సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం ఉందని, తదుపరి 24 గంటల్లో బలహీనంగా మారే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. మే 6న అదే ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని IMD తెలిపింది. మే 4న దక్షిణ అండమాన్ సముద్రం పరిసరాల్లో తుపాను ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో మే 6న అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తర్వాతి 24 గంటల్లో బలహీనపడే అవకాశం ఉంది అని IMD ఒక ట్వీట్‌లో తెలిపింది. అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు ఈ ప్రాంతాల్లోకి వెళ్లవద్దని సూచించింది.


"మే 5న అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మే 5, 6 వ తేదీల్లో ఆగ్నేయ బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రం మీదగా గాలులు (గంటకు 40-60 కి.మీ. వేగంతో) వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు ఈ ప్రాంతాల్లోకి వెళ్లవద్దు' అని IMD ట్వీట్ చేసింది. 






చల్లటి కబురు 


భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, దేశంలోని అనేక ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తున్నాయి. రాబోయే కొద్ది రోజుల్లో ఈశాన్య రాష్ట్రాలతో సహా కొన్ని కొండ ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మే 2న అరుణాచల్ ప్రదేశ్, సబ్ హిమాలయన్, పశ్చిమ బెంగాల్, సిక్కింలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. మే 2 నుంచి మే 4 వరకు అసోం, మేఘాలయాలో ఇదే వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలలో మే 3, 4 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా బిహార్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్ , ఒడిశాలో రాబోయే ఐదు రోజులలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో అక్కడక్కడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలుల వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఉంటుంది. రాబోయే ఐదు రోజులలో కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఉరుములు, మెరుపులతో కూడిన చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది.