తన రూమ్‌కి వచ్చిన సాక్షి.. జగతి విషయాన్ని ప్రస్తావించగానే రిషి ఫైర్ అవుతాడు. అన్ని నువ్వు అనుకుంటే సరిపోదని... ఇంటి నుంచి వెళ్లిపోవాలని గట్టిగా చెప్పేస్తాడు. అయినా సాక్షి వెళ్లకుండా కన్విన్స్‌ చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ రిషి వినిపించుకోడు. నిన్ను మర్చిపోవడం నా వల్ల కాలేదని చెబుతుంది. నిజంగా నమ్మాలని రిక్వస్ట్ చేస్తుంది. రిషి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. 


కారు డ్రైవింగ్ చేసుకుంటూ వసుధార, సాక్షి గురించి ఆలోచిస్తుంటాడు రిషి. వసుధారకు ఎందుకు సమాధానం ఎందుకు చెప్పలేకపోతున్నానని అనుకుంటూ వెళ్తాడు.  అదే టైంలో వసుధార కూడా అదే విషయంపై ఆలోచిస్తుంటుంది. రిషితో కరెక్ట్‌గానే మాట్లాడానా అని అనుకుంటూ ఆటో ఎక్కుతుంది. 


గతంలో సాయం చేసిన బస్తీకి వసుధార వెళ్లి అక్కడే ఓ ఇంటిలో ఉంటుంది. అక్కడ రిషి గురించి ఆలోచిస్తుంది. మీకు తెలియకుండానే నాకు సాయం చేశారని అనుకుంటుంది. 


కాలేజీ వద్ద వసుధార కోసం ఎదురు చూస్తుంటాడు రిషి. అక్కడే మెట్లపై చదువుతూ కనిపిస్తుంది వసుధార. దగ్గరకు వెళ్తాడు. గట్టిగా తిట్టేస్తాడు... ఇంతలో వేరే అమ్మాయి సార్ సార్ అని పిలుస్తుంది. అప్పుడే రిషికి తెలుస్తుంది వేరే అమ్మాయిని తిట్టేశానని. అప్పుడే ఆ అమ్మాయి చెబుతుంది వసుధార కాలేజీకి రాదని. మళ్లీ ఆలోచనలో పడతాడు. ఫోన్ చేస్తే కనెక్ట్‌ కావడం లేదు. ఎక్కడున్నావ్‌ అని అనుకుంటాడు. జగతికి తెలుసు ఉంటుంది అనుకుంటాడు. వసుధార గురించి అడుగుదామని అనుకుంటాడు. వసుధార ఎక్కడుందో అంటూ నసుగుతూ అడుగుతాడు. కాలేజీకి ఎందుకు రాలేదని ఆరా తీస్తాడు. జగతి వచ్చేలోపు సాక్షి వచ్చేస్తుంది.  సాక్షికి వార్నింగ్‌ ఇస్తున్నట్టుగానే జగతితో మాట్లాడతాడు. వసుధార గురించి తెలిస్తే చెప్పమంటాడు. రిషి వెళ్లిపోయిన తర్వాత జగతి, సాక్షి మధ్య చిన్న మాటల యుద్ధం నడుస్తుంది. 


ఇంకా రిషి మైండ్‌లో నుంచి వసుధార పోలేదు. ఇంకా వసుధార ఎమవుతుందనే ఆలోచనతే మనసును తొలిచేస్తుంది. ఇంతలో ఆటోలో వెళ్తున్న వసుధార కనిపిస్తుంది. కారులో వెంబడిస్తాడు. సగం దూరం వెళ్లేసరికి ఆటో కనిపించుకుండా పోతుంది. కారు దిగి వెతుకుతుంటాడు. కట్ చేస్తే పిల్లలతో దాగుడు మూతలు ఆడుతున్న వసుధార రిషిని పట్టుకుంటుంది. ఎవరని అడుగుతుంది. రిషీంద్ర భూషణ్ అని చెప్తాడు. షాక్‌ అయిన వసుధార కళ్లకు గంతలు తీసి చూస్తుంది. వసుధారను గట్టిగా తిట్టేస్తాడు. ఎక్కడున్నావో చెప్పాలి కదా అంటాడు. ఇలా కాసేపు ఇద్దరి మధ్య డిస్కషన్ నడుస్తుంది. తర్వాత రూమ్‌కి తీసుకెళ్తుంది వసుధార. 


రేపటి ఎపిసోడ్
ఉత్సాహంగా ఇంటికి వస్తున్న రిషిని ఫణి ఆటపట్టిస్తాడు. అన్నింటికి ఏదో ఒక రోజు సమాధానం దొరుకుతుందిలే డాడ్ అంటాడు.