What IF Earth's Oceans Disappeared:  ప్రపంచంలో ఉన్న సముద్రాలు అన్నీ ఎండిపోతే ఏంటీ పరిస్థితి. ఈ డౌట్ ఎప్పుడైనా వచ్చిందా మీకు. ఇప్పుడున్నట్లు ఇంత పెద్ద సముద్రాలు అన్నీ కనుమరుగైపోతే ఏం జరుగుతుంది. వేలు, లక్షల సంఖ్యలో సముద్రజలాల్లో బతుకుతున్న ప్రాణుల పరిస్థితి ఏంటీ. అసలు మనిషి సముద్రం లేకుండా బతకగలడా...మనం తాగని సముద్రం నీళ్లు అసలు మనకు ఎలా ఉపయోగపడతాయి.


ఎలా ఏర్పడింది?

ఓ వంద కోట్ల సంవత్సరాల ముందు భూమి మొత్తం సమతలంగా ఉండేది. అంటే ఈ కొండలు, మంచు పర్వతాలు ఇవేం లేకుండా చాలా ఫ్లాట్ గా మొత్తం నీటితో నిండిపోయి ఉండేది అన్నమాట. అలాంటి పరిస్థితుల నుంచి భూమి సముద్రం నుంచి బయటికి రావటం మొదలైంది.
ఫలితంగా భూ వాతావరణంలో చాలా కీలకమైన మార్పులు వచ్చాయి. భూమి మీద జీవం ఏర్పడటం జరిగింది కూడా అప్పుడే.

లోతైన మహా సముద్రాల లోపలో, పురాతన అగ్నిపర్వతాల మసి కుంటల్లోనో మొదటి జీవి ఏర్పడిందని భావిస్తారు. కానీ నీళ్లు లేకుండా ప్రాణం ఉద్భవించటం జరిగి ఉండేది కాదనేది మాత్రం వాస్తవం. సరే సముద్రం నుంచి పైకి వచ్చిన వేడెక్కటం..మెల్లగా సముద్రాలు వెనక్కి తగ్గి ఇదుగో ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఖండాలు ఇవన్నీ ఏర్పడ్డాయి.

ఇంత పెద్ద ప్రాసెస్ జరిగింది కదా. ఇప్పుడు ఈ భూమిపైన ఉన్న సముద్రాలన్నీ ఎండిపోతే ఏంటీ పరిస్థితి అనేది మన ప్రశ్న. ప్రస్తుతం భూమిపైన 70శాతం సముద్రాలే కప్పేసి ఉన్నాయి. వాటిలో ఎంత వాటర్ ఉండొచ్చు ఉంటే మనం కనుక ఒలింపిక్స్ లో లా స్విమ్మింగ్ పూల్స్ కట్టడం మొదలు పెడితే...అలాంటి స్విమ్మింగ్ పూల్స్ 500 ట్రిలియన్ పూల్స్ లో పట్టేంత వాటర్ ఉంది ఇప్పుడు సముద్రాల్లో. ఒక్క ట్రిలియన్ అంటేనే లక్ష కోట్లు...ఇక లెక్కేసుకోండి ఎంత వాటర్ ఉందో సముద్రాల్లో.



ఎండిపోయినా


ఒకవేళ ఈ సముద్రాలన్నీ ఎండిపోయినా ఇంకా ఈ భూమి మీద నీరు ఉంటుంది. భూమి మీద ఉన్న నీళ్లలో సముద్రాల్లో ఉండేది 97 శాతం నీరే. మిగిలిన మూడు శాతం నీరు నదులు, సరస్సులు, చెరువులు, భూగర్భ జలాలు, మంచు కొండల రూపంలో నిక్షిప్తమై ఉంది. కానీ ఇవి ఎంత ఉన్నా కూడా సముద్రాల్లో నీరు తరిగిపోతే భర్తీ చేయలేవు.

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రపంచంలో వాతావారణాన్ని కంట్రోల్ చేసే శక్తి సముద్రాలకే ఉంది. సూర్యుడి నుంచి వచ్చే విపరీతమైన వేడిని సముద్రాలు క్యాప్చర్ చేస్తాయి. ఎబ్జార్జ్ చేసుకుంటాయి. ఆ తర్వాత ఆ వేడిని ఈక్వల్ గా ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూట్ చేసేది మహా సముద్రాలే. అందుకే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఉష్ణోగ్రతలు చాలా వరకూ సరిసమానంగా ఉంటాయి. మరీ ధృవాల లాంటి ప్రాంతాల్లో అయితే తప్ప...ఆల్మోస్ట్ అన్ని దేశాల్లోనూ సీజన్స్ ఒకేలా ఉంటాయి.

అంతే కాదు వాటర్ సైకిల్ ను రన్ చేసేది కూడా సముద్రాలే. నీటిని ఆవిరి రూపంలో పైకి పంపే మేఘాలు ఏర్పడటానికి కారణమవుతున్నాయి సూర్యుడు, సముద్రాలే. ఒకవేళ మరి సముద్రాలు మాయమైతే మనకు వర్షాలు ఉండవు. గొడుగులు పట్టుకుని తిరగాల్సిన పని ఉండదు. గాల్లో ఉండాల్సిన తేమ ఉండదు. మేఘాలు ఏర్పడవు. వాతావరణ సమతుల్యత దెబ్బతింటుంది.  దట్టమైన, అంతులేని ఎడారులు ఏర్పడతాయి.

ఫలితంగా ముందు నష్టపోయేది సముద్ర జలాల్లోని జీవులే. చేపలు లాంటి అనేక వందల వేల కోట్ల ప్రాణులు అంతరించిపోతాయి. సూర్యుడి నుంచి వేడికి భూమి మొత్తం రోస్ట్ అయిపోతుంది. ఇప్పుడు వీనస్ ఎలా ఉందో అలా అయిపోతుంది అన్నమాట.

భూమి ఆవాసయోగ్యతను కోల్పోతుంది. ఎవరం బతకలేం ఇక్కడ. సముద్రాలు కాకుండా ఉన్న 3 శాతం నీళ్లు కూడా ఆవిరైపోవటానికి ఎంతో కాలం పట్టదు.  డీహైడ్రేషన్ తో మానవాళి వినాశనానికి దారి తీస్తుంది. కొన్ని జంతువులు మాత్రం మనుషులు బతకలేని పరిస్థితుల్లోనూ కూడా ఉండగలుగుతాయి. ముఖ్యంగా ఒంటెల్లాంటివి. ఒకవేళ సముద్రాలు ఎండిపోతే మానవజాతి నశించిపోతే కొద్దికాలం పాటు ఈ భూమి మీద ఒంటెలదే రాజ్యం.


అడవుల పరిస్థితి

సముద్రాలు అంతరించిపోయిన కొద్ది వారాలకే అడవుల పరిస్థితి దారుణంగా తయారవుతుంది. సూర్యుడి నుంచి వస్తున్న విపరీతమైన వేడికి దావానలం పుట్టుకుంటుంది. అడవులకు అడవులు కొన్ని నెలల పాటు తగలబడుతూనే ఉంటాయి. మొక్క అనేదే మిగలకుండా  భూమిపైన కరవు తాండవం చేస్తుంది. కొన్ని ఏళ్లకే భూమి మొత్తం మండిపోయి....జీవం లేని ఓ బండరాయిలా తయారవుతుంది. నీటి చుక్క లేకపోవటం వల్ల జీవం బతికే అవకాశమే లేదు. సో సముద్రాలను కాపాడుకోవటం మన బాధ్యత. వాటర్ ను కన్జర్వ్ చేసుకోవటం, కాలుష్యాన్ని తగ్గించుకోవటం, చేపల వేటను పరిమితం చేయటం లాంటి చర్యలను ప్రతీ ఒక్కరూ బాధ్యతగా తీసుకోకపోతే పైన చెప్పుకున్నవి జరగవు అనటానికి స్కోప్ కనబడటం లేదు.


Also Read: Vladimir Putin's Health: పుతిన్‌ కీలక నిర్ణయం- అధికార పగ్గాలు అప్పగించి సర్జరీకి సిద్ధం!


Also Read: Nand Mulchandani: అమెరికాలో మనోడికి అరుదైన గౌరవం- నిఘా సంస్థ సీటీఓగా నియామకం