Covid Pandemic:
కొవిడ్ మహమ్మారిపై బిలియనీర్ బిల్‌గేట్స్ మరోసారి హెచ్చరించారు. కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదన్నారు. మరింత ప్రాణాంతకమైన, శరవేగంగా వ్యాపించే సామర్థ్యం గల కొవిడ్ వేరియంట్ దూసుకొస్తున్నదని బిల్‌గేట్స్ అన్నారు.
తొలిసారి కాదు
వైరస్‌ల వల్ల ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పు గురించి బిల్‌గేట్స్ హెచ్చరికలు జారీ చేయడం ఇది తొలిసారి కాదు. 2015లో తొలిసారి బహిరంగంగా ప్రపంచ దేశాలను బిల్‌గేట్స్ హెచ్చరించారు. యావత్ ప్రపంచం తదుపరి మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేదన్నారు. కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో పలు దేశాల్లో ఆంక్షల అమలును నిలిపివేశారన్నారు. మహమ్మారిని ఎలా ఎదుర్కోవాలన్న విషయమై బిల్‌గేట్స్ పుస్తకం కూడా రాశారు.
వ్యాక్సిన్లు అవసరం
భవిష్యత్ మహమ్మారులను నివారించడానికి ఆరోగ్యం రంగంపై భారీ పెట్టుబడులు పెట్టాలని బిల్‌గేట్స్ పిలుపునిచ్చారు. ప్రస్తుత కొవిడ్ మహమ్మారి సోకకుండా దీర్ఘకాలం రోగ నిరోధక శక్తి గల వ్యాక్సిన్లను అత్యవసరంగా తేవాల్సి ఉందన్నారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. పలు దేశాల్లో మళ్లీ లాక్‌డౌన్ వంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. భారత్‌లో కూడా రోజువారి కరోనా కేసుల్లో క్రమంగా పెరుగుదల కనిపిస్తోంది. దీంతో కరోనా ఆంక్షలపై రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని కేంద్రం సూచించింది.
Also Read: Night Club Row : రాహుల్ నైట్ క్లబ్ వీడియోపై రాజకీయ రచ్చ - పెళ్లికెళ్తే తప్పేంటని కాంగ్రెస్ ప్రశ్న !
Also Read: Long Covid: కరోనా వచ్చి తగ్గిన వారిలో కొనసాగుతున్న లాంగ్ కోవిడ్, ఈ లక్షణాలు ఉంటే లాంగ్ కోవిడే