భారత్, యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ త్వరలోనే పూర్తవుతుందని నరేంద్ర మోదీ ప్రకటించారు.  మూడు రోజుల యూరప్‌ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ డెన్మార్క్‌ చేరుకున్నారు. కొపెన్‌హాగన్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని మోడీకి.. డానిష్‌ పీఎం మెట్టె ఫ్రెడరిక్సన్‌ సాదర స్వాగతం పలికారు.  డానిష్  ప్రధానమంత్రి మెట్ ఫ్రెడరిక్‌సన్‌తో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. కొపెన్‌హాగన్‌లోని ప్రధాని నివాసంలో ఈ సమావేశం జరిగింది. బ్యాక్‌యార్డ్‌లో నడుస్తూ   చర్చలు జరిపారు. భారత్‌-డెన్మార్క్‌ ద్వైపాక్షిక అంశాలపై ఇరు దేశాధినేతలు చర్చించారు. డెన్మార్ ప్రధాని తన ఇంటిని నరేంద్రమోదీకి చూపించారు. గతంలో భారత పర్యటనకు తనకు ప్రధాని మోదీ ఇచ్చిన పెయింటింగ్‌ను చూపించారు.




ఆ తర్వాత  ఇండియా- డెన్మార్ బిజినస్ ఫోరం మీటింగ్‌లో పాల్గొన్నారు.  పలు రంగాల్లో ఒప్పందాలు చేసుకున్న తర్వాత రెండు దేశాల ప్రధానమంత్రులు మాట్లాడారు. భారత్-ఫసిఫిక్ తో పాటు.. ఉక్రెయిన్ ఇష్యూపైన చర్చించినట్టు మోదీ చెప్పారు. భారత్ లో మౌలిక వసతుల రంగంలో, గ్రీన్ ఇండస్ట్రీస్ లో పెట్టుబడులకు చాలా అవకాశాలు ఉన్నాయన్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయబోతున్నట్టు డానిష్ ప్రధానమంత్రి మెట్ ఫ్రెడరిక్‌సన్‌ చెప్పారు . 



భారత్‌లో రెండు వందల వరకూ డెన్మార్ కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించాయని ... ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా వారంతా లాభాలు పొందుతున్నారని మోదీ వివరించారు. భారత్‌లో పెట్టుబడిదారులకు మంచి అవకాశాలు ఉన్నాయన్నారు.