హైదరాబాద్ శివారులోని   అబ్దుల్లాపూర్ మెట్  కొత్తగూడెం బ్రిడ్జికి సమీపంలో  కుళ్లిపోయిన స్థితిలో ఉన్న యువతీ, యువకుల మృతదేహాలు కలకలం రేపుతున్నాయి. కొత్తగూడెం బ్రిడ్జ్‌ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో  నగ్నంగా మృతదేహాలు ఉన్నాయి. గుర్తు పట్టడానికి వీలులేకుండా శవాలు కుళ్లిన స్థితిలో ఉన్నాయి. ఏకాంతంగా ఉన్న జంటను దుండగులు హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం మృతులు కవాడిగూడకు చెందిన వారుగా గుర్తించారు.  మృతి చెందిన యువకుడిని యశ్వంత్‌, యువతిని జ్యోతిగా గుర్తించారు  యువతి ముఖం గుర్తు పట్టడానికి వీల్లేకుండా ఉంది. సంఘటన స్థలానికి కొద్దిదూరంలోనే హోండా యాక్టివాను పోలీసులు గుర్తించారు. జాతీయ రహదారికి దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఈ శవాలు పడి ఉండటంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 


నిన్న కలెక్టర్ - నేడు లోక్‌సభ స్పీకర్ ! వాట్సాప్ డీపీలతోనే ముంచేస్తున్నారు !


యశ్వంత్ వారాసీగూడ బౌధ్దనగర్ ప్రాంతానికి చెందినవాడుగా గుర్తించారు. చనిపోయిన మహిళను జ్యోతి అని పోలీసులు నిర్ధారించారు. సంఘటన స్థలంలో ఓ బ్యాగును పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.ఈ బ్యాగులో సెంట్రో చెప్పుల దుకాణంలో చెప్పులు కొనుగోలు చేసిన రశీదు లభ్యమైంది. ఈ రశీదుపై జ్యోతి అనే పేరు ఉంది.   జ్యోతికి ఈ చెప్పులను శ్రీనివాస్ అనే వ్యక్తి ఇప్పించాడు. ఈ విషయాన్ని పోలీసులకు ఫోన్ లో చెప్పాడు. ఫోలీసులతో ఫోన్ మాట్లాడిన తర్వాత శ్రీనివాస్ ఫోన్ స్విచ్ఛాప్ చేసి ఉంది.


విజయనగరంలో అర్థరాత్రి అత్యాచారం- పోలీసులు విచారణలో ఆ వ్యక్తి ఎవరో తెలిసి బాధితురాలు షాక్!


ఈ ప్రాంతం నుండి దుర్వాసన వస్తుందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దుర్వాసన వచ్చే ప్రాంతానికి వెళ్లి పోలీసులు పరిశీలిస్తే రెండు డెడ్ బాడీలు కన్పించాయి.సంఘటన స్థలంలో జ్యోతి, యశ్వంత్ కి చెందిన వస్తువులను దూరంగా నిందితులు విసిరివేశారు.  జ్యోతికి వివాహమై  ఇద్దరు పిల్లలున్నారు. వివాహేతర సంబంధం కోణంలో కూడా పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 


ఏకాంతంగా ఉన్న సమయంలో ఎవరైనా దుండగులు దాడి చేసి సామూహిక అత్యాచారానికి ప్రయత్నించి ఇద్దరినీ చంపేశారా లేకపోతే.. వీరి మధ్య వివాహేతర బంధం గురించి తెలిసి.. ఏకాంతంగా గడపడానికి వస్తున్నారని తెలిసి వెంబడించి హత్య చేశారా అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ హత్యల్లో చాలా కోణాలున్నాయని.. దర్యాప్తులో అన్నీ విషయాలు తేలుతాయని పోలీసులు చెబుతున్నారు.