టీవల ఊహించనివిధంగా వినూత్న రీతుల్లో దొంగలు తమ తెలివితేటలను ప్రదర్శిస్తున్నారు. టెక్నాలజీ నాలెడ్జ్‌తో వ్యక్తులను బురిడీ కొట్టిస్తున్నారు. ఏం జరిగిందని తెలిసేలోపే అంతా అయిపోతుంది. ఒక కాల్‌, మెసేజ్‌, వాట్సప్‌, లింక్‌, మెయిల్‌.. ఒకటేమిటీ దేన్ని నమ్మాలో, నమ్మకూడదో కూడా తెలీని విధంగా క్షణాల్లో చోరీలు జరిగిపోతున్నాయి. తాజాగా వాట్సాప్‌ డీపీలు ప్రముఖులవి పెట్టి..వారే చాటే చేస్తున్నట్లుగా చెప్పి ఉన్నదంతా ఊడ్చుకుపోయే దొంగలు బయలుదేరారు. ఇటీవల ఆదిలాబాద్ కలెక్టర్ డీపీతో వాట్సాప్ గ్రూప్ పెట్టి ఇలాగే డబ్బులు వసూలు చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. తాజాగా అదే నేరాన్ని...  లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా డీపీ ద్వారా చేయాలనుకున్నారు ఒరిస్సా చీటర్స్. 


అనంతపురం జిల్లాలో విద్యార్థుల వింతచేష్టలు, స్కూల్‌లో ఫర్నీచర్ ధ్వంసం, సోషల్ మీడియాలో వీడియో వైరల్‌
 
' అత్యవసర సమావేశంలో ఉన్నా. ఫోన్‌ చేయలేకపోతున్నా. డబ్బులు అవసరం. వెంటనే పంపగలరు '' అని మెసేజ్‌లు వస్తాయి.  ఇంతకీ ఎవరిది ఆ నెంబర్‌ అని డీపీ ని చూస్తే అంతా ఓం ప్రకాష్ బిర్లాది. ట్రూకాలర్‌లో చూస్తే ఆయన పేరే వస్తోంది.  దీంతో చాలా మంది నిజమేనని డబ్బులు పంపడం ప్రారంభించారు. కానీ మోసం ఎక్కడో చోట బయటపడాల్సిందే. పడింది కూడా. ఒరిస్సాలో ఓ సైబర్ నేరగాళ్ల ముఠా.. లోక్​సభ స్పీకర్​ ఓం ప్రకాశ్​ బిర్లా పేరుతో ఓ సిమ్ కార్డును యాక్టివేట్ చేయించి  ఆయన ఫొటోతోనే వాట్సాప్​ ఖాతా క్రియేట్​ చేసి ప్రజలను డబ్బులు అడుగడం ప్రారంభించారు. ఇదే నంబర్‌ను మూడు ఫోన్లలో ఉపయోగిస్తున్నారు.  


శంషాబాద్ ఎయిర్ పోర్టులో రూ.80 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్, ట్రాలీ బ్యాగ్ లో సీక్రెట్ గా కొకైన్ తరలింపు


ఈ ఘటనకు సంబంధించి సాయి ప్రకాశ్ దాస్​, అవినాశ్ నాయక్​ సహా ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరు వివిధ సర్వీస్ ప్రొవైడర్లకు చెందిన సిమ్​కార్డులను విక్రయించే వ్యాపారం చేస్తున్నారు. లోక్‌సభ స్పీకర్ పేరు చెప్పిఎంత మందిని అలా మోసం చేశారా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇటీవల ఇలాంటి నేరాలు పెరిగిపోవడంతో సిమ్ కార్డుల యాక్టివేషన్ మీద పోలీసులు ప్రత్యేకంగా గురి పెట్టాల్సి ఉంది. నకిలీ గుర్తింపు కార్డులతో ప్రముఖుల పేర్లతో సిమ్‌లు తీసుకుని వాటితోనే ప్రజలను బురిడి కొట్టిస్తున్నారు. అధికారంలో ఉన్న వారు కావడంతో డబ్బులు అడిగితే ఇవ్వడానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా మోసాలు పెరిగిపోతున్నాయి.