ఎక్కిళ్లు చాలా మందికి వస్తుంటాయి. ఒక్కోసారి అవి వెంటనే తగ్గకుండా ఇబ్బంది పెడుతుంటాయి. అవెందుకు వస్తాయో తెలుసా? డయాఫ్రాగమ్ అని పిలిచే కండరానికి సంబంధించిన సంకోచ వ్యాకోచాలే ఎక్కిళ్లు. ఇది ఊపిరితిత్తుల కింద ఉంటుంది. శ్వాసక్రియలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎక్కిళ్లు అధికంగా కారంతో నిండిన ఆహారం తినడం, ఆల్కహాల్ తీసుకోవడం, గాలి ఉష్ణోగ్రతలో హఠాత్తుగా మార్పు రావడం, అధిక ఉత్సాహం, మానసిక ఒత్తిడి కారణంగా ఎక్కిళ్లు వస్తుంటాయి. వాటిని అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక అయిదు నిమిషాలు వచ్చి పోతాయి. కానీ కొందరిలో తరచూ వస్తుంటాయి. అతిగా ఎక్కిళ్లు రావడం జరిగితే కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. అలాగే కొన్ని ఇంటి చిట్కాలు కూడా బాగా పనిచేస్తాయి.
చాక్లెట్ పొడి
ఎక్కిళ్లు వేధిస్తున్నప్పుడు ఒక స్పూను చాక్లెట్ పౌడర్ నోట్లో వేసుకోవాలి. దీని సమర్థమంతమైన ఫ్లేవర్ వాగస్ నాడిని కమ్మేస్తుంది. వెంటనే అసంకల్పిత సంకోచ వ్యాకోచాలను ఆపమని మెదడుకు ఒక సంకేతం వెళ్తుంది. ఒక నిమిషంలో ఎక్కిళ్లు ఆగిపోతాయి.
తేనె
వాగస్ అనేది ఒక నరం. ఇది పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను నియంత్రిస్తుంది. అలాగే జీర్ణవ్యవస్థ చర్యలను నియంత్రించడం కూడా దాని పని. తేనె తాగగానే వాగస్ నాడి ఉపశమనం చెందుతుంది. ఎక్కిళ్లు రాకుండా అడ్డుకుంటుంది. త్వరగానే వాటిని ఆపేస్తుంది.
వెనిగర్
ఎక్కిళ్లను ఆపడానికి మరో మార్గం కొన్ని చుక్కల వెనిగర్‌ను తాగడం. వెనిగర్లో కొన్ని పుల్లని సమ్మేళనాలు ఉంటాయి. అది డయాఫ్రాగమ్ అసంకల్పిన కదలికలను రీసెట్ చేస్తుంది. వెనిగర్ ఎక్కిళ్ల నుంచి తక్షణ ఉపశమనాన్ని కలిగిస్తుంది.
చక్కెర
ఎక్కిళ్లకు చక్కెరతో కూడా చెక్ పెట్టొచ్చు. చక్కెర గుళికల ఆకారం అన్నవాహికకు కాస్త చికాకును కలిగిస్తుంది. ఇది వాగస్ నాడిని మరింత ప్రేరేపిస్తుంది. ఎక్కిళ్లు తగ్గేలా మెదడుకు సిగ్నల్స్ చేరుతాయి. ఒక నిమిషంలోపలే ఎక్కిళ్లు తగ్గుతాయి.
పీనట్ బటర్
ఎక్కిళ్ల నుంచి బయట పడేందుకు పీనట్ బటర్ ని వాడుకోవచ్చు. అధ్యయనాల ప్రకారం పీనట్ బటర్ మెల్లగా జీర్ణం అవుతుంది. దాని జీర్ణ ప్రక్రియ శ్వాస, మింగడం రెండు పద్దతులను మారుస్తుంది. దీని వల్ల వాగస్ నాడి భిన్నంగా స్పందించి ఎక్కిళ్లను ఆపేలా చేస్తుంది.
నిమ్మ
ఎక్కిళ్లు వదిలించుకోవడానికి మరో సులభమైన మార్గం నిమ్మకాయను కాసేపు వాసన చూడడం. నిపుణుల అభిప్రాయం ప్రకారం నిమ్మకాయలో అధిక ఆమ్ల కంటెంట్ ఉంటుంది. ఇది అన్నవాహికకు అంతరాయం కలిగిస్తుంది. తద్వారా వాగస్ నాడిపై ప్రభావం పడుతుంది. వాగస్ నాడి వెంటనే మెదడుకు ఎక్కిళ్లను ఆపేలా సిగ్నల్స్ పంపిస్తుంది.
Also read: ఆల్కహాల్ అతిగా తాగుతున్నారా? ఈ లక్షణాలు కనిపిస్తే లివర్ డామేజ్ అయినట్టే
Also read: వేసవిలో రాగి అంబలి ఇలా చేసుకుని తాగితే ఎంతో చలువ, వడదెబ్బ కొట్టదు