ఆస్తమా లేదా ఉబ్బసం.. ఒక్కసారి వ్యాధి ఏర్పడిందంటే ఎన్నో సమస్యలు ఎదుర్కోవాలి. ముఖ్యంగా పిల్లలు పడే బాధ వర్ణనాతీతం. ప్రపంచంలో ఎంతోమంది ఆస్తమాతో ఇబ్బందిపడుతున్నారు. ఇండియాలో దాదాపు 3 కోట్ల మంది ఉబ్బసంతో బాధపడుతున్నారని అంచనా. పిల్లల్లో పెద్దల్లో అందరిలోనూ ఈ సమస్య వస్తుంది. అయితే, ఆస్తమాపై ఎన్నో రకాల అపోహలు ఉన్నాయి. వ్యాధి కంటే ఎక్కువగా భయానికి గురిచేసేవి అవే. మంగళవారం (మే 3, 2022) ‘వరల్డ్ ఆస్తమా డే’ సందర్భంగా ఆస్తమా అపోహలు, వాస్తవాలు గురించి హరిని హాస్పిటల్‌కు చెందిన పల్మానాలోజిస్ట్ డాక్టర్ శివ ప్రసాద్ మాట్లాడారు. ఆ వివరాలు మీ కోసం. 


ఆస్తమా అనేది అంటువ్యాధి కాదని, వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉందన్నారు డాక్టర్ శివ ప్రసాద్ తెలిపారు. ‘‘అస్తమా వున్నవారికి కొన్ని ఆహార పదార్థాలు పడవు. ప్రజలు వాటికి దూరంగా ఉండాలి. కుటుంబంలో తల్లి లేదా తండ్రి.. ఎవరికైన ఒకరికి ఆస్తమా ఉంటే 40% దాకా పిల్లలకు వచ్చే అవకాశం ఉంది. తల్లి, తండ్రి.. ఇద్దరికీ ఉంటే, 60% దాకా పిల్లలకు ఆస్తమా వచ్చే అవకాశం ఉంది. కానీ, కచ్చితంగా వస్తుందని చెప్పలేం. కొంతమంది పిల్లల్లో చిన్న వయసులో వచ్చిన ఆస్తమా 15 - 16 ఏళ్ళ వయసు వచ్చేసరికి తగ్గిపోతుంది. మరికొంతమందికి కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి’’ అని శివ ప్రసాద్ తెలిపారు. 


Also Read: తల్లిదండ్రులూ జాగ్రత్త, పిల్లల ప్రాణాలు తీస్తున్న వింత వ్యాధి, లక్షణాలు ఇవే


‘‘గతంలో ఆస్తమా ట్రీట్మెంట్ ఎలా ఉన్నా ఇప్పుడు ఇన్ హెల్లర్స్ వలన పరిస్థితి చాలా మారింది. వాటిని చాలా సులభంగా మనతో క్యారీ చేయొచ్చు. రాబోయే రోజుల్లో ట్రీట్మెంట్‌లో మరిన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది. మరీ చిన్నపిల్లల్లో ఆస్తమాను గుర్తించడానికి, పిల్లలు ఎక్కువగా దగ్గుతున్నా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలని చిన్న పిల్లలకు ఇన్ హెల్లర్స్ వాడకూడదు అనేది కేవలం అపోహ మాత్రమే. పిల్లలకైనా పెద్దలకైనా ఆస్తమాను గుర్తించి సరైన సమయంలో ట్రీట్మెంట్ తీసుకుంటే సాధారణ జీవితం గడపచ్చు. కొంతమంది ఆయాసంగా వున్నప్పుడు ఇంటిలోనే నాటు పద్ధతులు అనుసరిస్తారు. అప్పటికప్పుడు కొంచెం రిలీఫ్ వచ్చినా వైద్యుడిని సందర్శించి కండిషన్‌ను బట్టి ట్రీట్మెంట్ తీసుకోవాలి’’ అని తెలిపారు.


Also Read: దంత సమస్యలతో గుండె జబ్బులు, ఈ అలవాట్లు వెంటనే మానుకోండి


పల్మానాలోజిస్ట్ డాక్టర్ శివ ప్రసాద్ పూర్తి ఇంటర్వ్యూను ఇక్కడ చూడండి: