Just In
Killer Cocount Water: కొబ్బరి నీళ్లు తాగితే చచ్చిపోతారా? ఈ డెన్మార్ వ్యక్తి విషాదాంతం గురించి తెలిస్తే నమ్మాల్సిందే !
Coconut Water: ఆరోగ్యం మెరుగుపడటానికి కొబ్బరి నీళ్లు తాగుతాం. కానీ ఆ కొబ్బరి నీళ్లు ప్రాణం తీస్తే ?
Killer Fungal Infection: డెన్మార్క్ లోని 69 ఏళ్ల వ్యక్తి తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాడు. అప్పటి వరకూ బాగానే ఉన్న ఆయన కొబ్బరి బొండాంలో నీళ్లు తాగిన కాసేపటికే అతనికి తీవ్రమైన చెమట, వికారం, వాంతులతో అస్వస్థకు గురయ్యారు. అతని చర్మం పాలిపోయింది. వెంటనే ఆ వ్యక్తి బందువులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. చాలా టెస్టులు చేశారు. చివరికి MRI స్కాన్‌లలో మెదడు వాపు కనిపించింది. అయితే అసలు అంత హఠాత్తుగా ఈ మెదడు వ్యాపు ఎందుకు వచ్చిందో మాత్రం వైద్యులు కూడా గ ుర్తించలేకపోయారు. మెదడు పనిచేయకపోవడానికి దారితీసే మెటబాలిక్ ఎన్సెఫలోపతికి చికిత్స చేసినప్పటికీ ఆ పెద్దాయన కోలుకోలేదు. 26 గంటల తర్వాత బ్రెయిన్ డెడ్ అయ్యాడు. దీంతో లైఫ్ సపోర్టు ఆపేశారు. కొబ్బరి నీళ్లు తాగిన ఇరవై ఆరు గంటల్లో అతను చనిపోయాడు.
చనిపోవడానికి కారణమేమిటో తెలుసుకుందామని.. వైద్యులు పరిశీలన చేశారు. చనిపోవడానికి ముందు ఆయన ఏం తిన్నారు.. ఏం తాగారో చూశారు. ఆయన తాగిన కొబ్బరి బొండాంను గుర్తించారు. అందులో చూస్తే కొబ్బరి నీళ్ళు దుర్వాసనతో, కుళ్ళిపోయి ఉన్నట్లుగా గుర్తించారు. వెంటనే ఆ కొబ్బరి నీళ్లను టెస్టులకు పంపించారు.
ఆ కొబ్బరికాయని పూర్తిగా ఓపెన్ చేయకపోయినా.. దాన్ని తాగడానికి అనువుగా..ఎప్పుడు కావాలంటే అప్పుడు స్ట్రా పెట్టుకునేలా తోలు తీశారు. కానీ చాలా రోజుల పాటు దాన్ని బ యటే ఉంటారు. కానీసం ఫ్రిజ్ లో పెట్టలేదు. ఎక్కువ కాలం ఉండటం వల్ల హానికరమైన బ్యాక్టీరియా లోపల పెరిగిపోయింది. అయితే ఎంత కాలమైనా కొబ్బరి నీరు సురక్షితమని నమ్మిన ఆ పెద్దాయని వాటిని తాగేశారు. అసహ్యకరమైన రుచిని గమనించి తక్కువ మొత్తంలో మాత్రమే తీసుకున్నాడు. కొబ్బరికాయను తెరిచిన తర్వాత, లోపలి భాగం జిగటగా, కుళ్ళిపోయినట్లుగా ఉందని తన భార్యకు కూడా చెప్పాడు. అయినా నిర్లక్ష్యంగా తాగడంతో ప్రాణాలు పణంగా పెట్టాడు.
కొబ్బరి కాయలను చెట్టు నుంచి దింపిన తర్వాత కొన్ని రోజులు మాత్రమే సేఫ్ గా ఉంటాయి. తర్వాత వాటిని ఉష్ణోగ్రత 4°C–5°C వద్ద ఉంచాలని సిఫారసు చేస్తున్నారు. కొబ్బరికాయను ముందుగా చుట్టూ కొట్టేసి తెలుపు టెంక వరకే ఉంచిదే.. బయట ఎక్కువ రోజులు ఉంచకూడదు. ఖచ్చితంగా ఫ్రిజ్‌లో నిల్వ చేయాలని నిపుములు చెబుతున్నారు. తెరిచిన కొబ్బరికాయలు (తెల్లటి గుజ్జుతో) ఎల్లప్పుడూ ఫ్రిజ్‌లో నిల్వ చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే వాటి షెల్ఫ్ జీవితం చాలా తక్కువగా ఉంటుందని.. మొత్తం, తెరవని కొబ్బరికాయలను గది ఉష్ణోగ్రత వద్ద కొన్ని నెలల పాటు ఉంచవచ్చని అంటున్నారు. ముందుగా గుండు చేసిన తర్వాత, కొబ్బరికాయలను గాలి చొరబడని కంటైనర్ లేదా జిప్‌లాక్ బ్యాగ్‌లో నిల్వ చేసి వెంటనే రిఫ్రిజిరేటర్‌లో ఉంచాలని సలహాలిస్తున్నారు.
ఆహార సంబంధిత వ్యాధులను నివారించడానికి, పోషక విలువలను కాపాడటానికి ప్రజారోగ్యాన్ని నిర్ధారించడానికి సురక్షితమైన ఆహార నిర్వహణ చాలా కీలకం. కలుషితమైన ఆహారంలో హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌లు మరియు విషపదార్థాలు ఉంటాయి, ఇవి ఫుడ్ పాయిజనింగ్ , డయేరియా వంటి ఇన్ఫెక్షన్‌లకు దారితీస్తాయని నిపుణులు చెబుతున్నారు. పాడైపోతే.. కొబ్బరి నీళ్లు అయినా ప్రాణాలు తీస్తాయని డెన్మార్క్ పెద్దాయన మరణం చెబుతోంది. అందుకే కొబ్బరి నీళ్ల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాల్సిందే.