Operation Keller TRF Chief Killed | భద్రతా దళాల ఆపరేషన్ లో TRF చీఫ్ హతం.? | ABP Desam

 భారత భద్రతా దళాలు ఆపరేషన్  కెల్లర్ ను ప్రారంభించాయి.  పహల్గామ్ దాడి వెనుక ఉన్న ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థైన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ TRF చీఫ్ షాహిద్ కుట్టాయ్ జమ్మూ కాశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించినట్లు సమాచారం. ఆపరేషన్ కెల్లర్ అని ఆర్మీ పేరు పెట్టుకున్న ఈ ఆపరేషన్ లో కుట్టే తో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదులు కూడా ప్రాణాలు కోల్పోయారు.  షాహిద్ కుట్టే 2024లో బీజేపీ సర్పంచ్ హత్య, డానిష్ రిసార్ట్‌పై దాడి , యు కుల్గామ్‌లో టెరిటోరియల్ ఆర్మీ సిబ్బంది హత్య వంటి ఘటనల్లో పాల్గొన్నాడు. పహల్గామ్ దాడులకు మాస్టర్ మైండ ఇతనేనని భావిస్తున్నారు.  చనిపోయిన మరో ఉగ్రవాదిని అద్నాన్ షఫీగా గుర్తించారు. అతను TRF ,  LeT యొక్క టాప్ కమాండర్, హారిస్ నజీర్ మరోటెర్రరిస్టు హతమయ్యాడు.  పుల్వామాకు చెందిన ఈ ఉగ్రవాదికి కూడా TRF/LeTతో సంబంధాలున్నాయి. రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్‌కు షోకల్ కెల్లర్‌లో ఉగ్రవాదుల ఉనికిపై ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ సమాచారం అందడంతో ఆపరేషన్ కెల్లర్ ప్రారంభమైంది. ఆ విషయాన్ని ఇండియన్ ఆర్మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola