PM Modi Adampur Airbase Tour Reasons | ఉన్నపళంగా మోదీ అందపుర్ కి ఎందుకు వెళ్లారంటే | ABP Desam
పాకిస్థాన్ ఏం చెబుతోంది. ఫేక్ వార్తలతో అక్కడి ప్రజలను ప్రభుత్వాన్ని అంతెందుకు ప్రపంచదేశాలను మభ్యపెడుతోంది. పాక్ చెప్పిన సొల్లు వార్తలలో మొదటి అదంపూర్ ఎయిర్ బేస్ ను తునాతునకలు చేశాం. మేం కొట్టిన దెబ్బకు ఆ ఎయిర్ బేస్ ఫంక్షనింగ్ లోకి రావాలంటే ఏళ్లు పడుతుంది అని. అంతటితో ఆగలేదు అక్కడ ఉండే S400 మిగ్ 29 విమానాలను పేల్చి పారేశాం అని. ఫేక్ ముచ్చట్లతో రోజులు గడుపుతున్న పాకిస్తాన్ భరతం పట్టేలా భారత్ ప్రధాని నరేంద్ర మోదీ అందపూర్ ఎయిర్ బేస్ ను పర్యటించారు. ఆయన పర్యటనకు కారణాలు ఎక్కడా వెల్లడించలేదు. అలా అని అక్కడ సుదీర్ఘ ప్రసంగాలు చేయలేదు. జస్ట్ సైనికులను కలిసి భారత్ మాతాకీ జై అన్నారు. ఉగ్రవాదులపై పోరులో దుమ్ము దులిపేశారంటూ ప్రశంసించారు. కానీ మోదీ విజువల్స్ లో ఆయన చెప్పాల్సినవన్నీ ఉన్నాయి. సింగిల్ ట్రిప్పుతో పాకిస్థాన్ ఆడుతున్న ఫేక్ డ్రామాలకు చెక్ పెట్టారన్న మాట ప్రధాని మోదీ.