BLA operation herof turns deadly For Pakistan Army: కశ్మీర్ లో ఉగ్రవాదాన్ని ఎగదోసి తమ ఇంటికి నిప్పు పెట్టుకున్న రీతిలో వ్యవహరించిన పాకిస్తాన్ ఆర్మీకి.. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బ్లడ్ బాత్ అంటే ఏంటో చూపిస్తోంది. వరుసగా కనిపించిన పాకిస్తాన్ ఆర్మీని చంపేస్తున్నారు. దానికి వారు ఆపరేషన్ హెరోఫ్ అనే పెరు పెట్టుకున్నారు.  

పాకిస్తాన్ ఆర్మీపై ఆపరేషన్ హీరోఫ్ అమలు చేస్తున్న బలూచ్ ఆర్మీ

 ఆపరేషన్ హీరోఫ్ పేరుతో  బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) పాకిస్తాన్ ఆర్మీపై విరుచుకుపడుతోంది. బలూచ్ స్వాతంత్ర్యం కోసం  పాకిస్తాన్ సైన్యం   "ఆక్రమణ"ను ఎదిరించడం  కోసం..   బలూచ్ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడం కోసం తాము ఈ ఆపరేషన్ హీరోఫ్ ప్రారంభించామని బీఎల్ఏ ప్రకటించుకుంది.  "హీరోఫ్" అంటే బలూచీ,  బ్రాహుయి భాషలలో "డార్క్ స్టార్మ్" అని అర్థం.  ఈ ఆపరేషన్ ను  బలూచ్ స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక మైలురాయిగా చెప్పుకుంటున్నారు. 

బలూచ్ పై పట్టు సాధించిన బీఎల్ఎ -  130 మంది పాక్ సైనికుల హతం 

ఆపరేషన్ హెరోఫ్‌ను  2024 ఆగస్టు 25 నుంచి ప్రారంభించారు.   ఇప్పటి వరకూ బలూచ్ ప్రాంతంలోని 51 ప్రాంతాల్లో 71 దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 130 మంది పాక్ సైనికులు చనిపోయారు.  లాస్బెలా జిల్లాలోని పాకిస్తాన్ సైన్యం   ప్రధాన స్థావరంపై మజీద్ బ్రిగేడ్  పై   ఏడుగురు ఆత్మాహుతి దళ సభ్యులు  దాడి చేశారు. వారు 20 గంటల పాటు స్థావరంలో గణనీయమైన బలూచ్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు.   పాకిస్తాన్ సైనిక సిబ్బందిని హతమార్చారు,  డజన్ల మందిని గాయపరిచారు. ఈ దాడుల్లో ఆయుధాలు మరియు మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇంకా లెక్కలేనన్ని చోట్ల దాడులు చేశారు.        

బలూచ్ మొత్తం  రహదారులపై చెక్ పోస్టులు 

పాకిస్తాన్ సైన్యం, ఫ్రాంటియర్ కార్ప్స్  ,   ఇతర భద్రతా బలగాలపై లక్ష్యంగా దాడులు చేయడం, వారి సామర్థ్యాన్ని బలహీనపరచేలా బీఎల్ఏ పని చేస్తుంది.  బలూచిస్థాన్‌ను పాకిస్తాన్ "ఆక్రమణ" నుండి విముక్తి చేసి స్వతంత్ర బలూచ్ రాష్ట్రాన్ని స్థాపించడం లక్ష్యంగా పెట్టుకుంది.  బలూచ్ ప్రజలను సాయుధ పోరాటంలో చేర్చుకుంటోంది.  ఆపరేషన్ హీరోఫ్ బలూచిస్థాన్   వివిధ జిల్లాలలో బలంగా ఆర్మీపై దాడులు చేస్తోంది. ఈ బీఎల్ఎల్ బహుముఖంగా విస్తరించింది. ఆత్మాహుతి దాడులు, రహదారి అడ్డగింతలు,  సైనిక స్థావరాలపై దాడులతో ఆపరేషన్ హెరోఫ్ ను ఉద్ధృతంగా కొనసాగిస్తోంది.            

బలూచ్ ప్రజలందరిదీ ఒకటే మాట - ప్రత్యేక బలూచ్ వాదన

 బలూచిస్థాన్  సహజ వనరులతో నిండిన ప్రాంతం. దశాబ్దాలుగా స్వాతంత్ర్య ఉద్యమాలకు కేంద్రంగా ఉంది. బలూచ్ స్వాతంత్ర్యవాదులు పాకిస్తాన్ , ఇరాన్‌లు తమ భూమిని "ఆక్రమించాయి" అని ఆరోపిస్తారు.  మానవ హక్కుల ఉల్లంఘనలు, ఆర్థిక,   అభివృద్ధి లేకపోవడం వంటి సమస్యలను అక్కడి ప్రజలు ఎత్తి చూపుతారు. తమకు ప్రత్యేక దేశం కావాలని   బలూచ్ జాతీయవాద సాయుధ సంస్థ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఏర్పాటు చేసుకున్నారు.  2006న బలూచ్ తెగ నాయకుడు ,  మాజీ గవర్నర్ నవాబ్ అక్బర్ షాబాజ్ ఖాన్ బుగ్టీ హత్య చేసారు. ఆ రోజున ఈ సంస్థను ప్రారంభించారు.  ఆగస్టు 26ని బలూచ్ జాతీయవాదులకు ఒక కీలకమైన రోజు.     

పెద్ద ఎత్తున బలూచ్ ఆర్మీలో చేరుతున్న బలూచ్ ప్రజలు  ఆపరేషన్ హీరోఫ్ బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ  సైనిక సామర్థ్యం ,వ్యూహాత్మక సమన్వయాన్ని ప్రదర్శించిన ఒక మైలురాయి ఆపరేషన్.  పాకిస్తాన్ భద్రతా బలగాలకు గణనీయమైన నష్టాన్ని కలిగించింది.  ఈ ఆపరేషన్ బలూచ్ జాతీయవాదాన్ని బలోపేతం చేసింది, మహిళలు, మాజీ సైనికులు పెద్ద ఎత్తున బీఎల్ఏలో చేరారు. వీళ్ల నుంచి తమను కాపాడుకోవడం ఆర్మీకి కష్టంగా మారింది. అందుకే బలూచ్ ప్రాంతం వైపు ఆర్మీ కన్నెత్తి చూడలేకపోతోంది.