Pakistan Army Officer English : భారత్ ఆర్మీ ఆఫీసర్లు ప్రెస్మీట్ పెట్టి పాకిస్తాన్ కు ఎంత నష్టం చేశామో ఆధారాలతో సహా వివరించారు. అంతర్జాతీయ సమాజానికి తెలిసేలా ఇంగ్లిష్ లో కూడా మాట్లాడారు. అయితే పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్లు కూడా మాకేం తక్కువ అని తెర ముందుకు వచ్చారు. అయితే వారికి చాలా తక్కువ ఉందని ఆ ప్రెస్మీట్లో తేలిపోయింది. వారి దగ్గర సబ్జెక్ట్ లేకపోగా.. అసలు ఇంగ్లిష్ కూడా రాక నవ్వుల పాలయ్యారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.  

 పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ల ఇంగ్లిష్ స్కిల్స్ చూసి.. సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. భార త ఆఫీసర్లుగాలా ధాటిగా మాట్లాడదామని అనుకున్నారు కానీ.. వారి పరిస్థితి తేలిపోయింది.  

అసలు ఈ ప్రెస్ మీట్ లో ఆర్మీ ఆఫీసర్ ఏం చెప్పాలనుకున్నారంటే.. భారత్ కు చెందిన రఫెల్ విమానాన్ని మేం కూల్చేశాం అని చెప్పాలనుకున్నారు. అయితే అది నోటి మాట గానే.. పాకిస్తాన్ కు చెందిన పదకొండు ఎయిర్ బేసులను ధ్వంసం చేశామని భారత అధికారులు ప్రకటించి అధారాలు చూపించారు. మరి ఆ మేరకు.. మీరు ఆధారాలు చూపించగలరా అని అడిగిన వారికి..  పాకిస్తాన్ ఆర్మీ ఆఫీపస్.. అబ్బ..జబ్బ..దబ్బ సమాధానం ఇచ్చారు.  

ఆపరేషన్ సిందూర్‌లో భారత్   పాకిస్తాన్‌లోని 11 ఎయిర్ బేస్‌లను ధ్వంసం చేసింది. ఇందులో అత్యంత ముఖ్యమైనది  నూర్ ఖాన్ ఎయిర్ బేస్. ఇది రావుల్పిండిలో ఉంది.  ఇస్లామాబాద్ నుండి 10 కి.మీ. దూరంలో ఉన్న ఈ స్థావరం పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్   లాజిస్టిక్ ,  కమాండ్ హబ్‌గా పనిచేస్తుంది.   ఇక్కడ ఉన్న C-130 ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్, IL-78 రీఫ్యూయలింగ్ ట్యాంకర్స్, మరియు సాబ్ ఎరీఐ ఎయిర్‌బోర్న్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ను భారత దళాలు ధ్వంసం చేశాయి.  చక్వాల్‌లోని మురిద్ ఎయిర్ బేస్ ను కూడా భారత దళాలు ధ్వంసం చేశాయి.  - డ్రోన్ యుద్ధానికి కేంద్రంగా ఉన్న ఈ స్థావరం ఉంది. పలు ఆధునాత డ్రోన్ లను కలిసి ఉన్నాయి. భారత్ చేసిన దాడిలో డ్రోన్ సౌకర్యాలు, ఫైటర్ జెట్‌లు  ధ్వంసమయ్యాయి.  వీటిని కప్పి పుచ్చుకునేందుకు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ప్రయత్నిస్తోంది.