Beautiful Places To Visit in World చిన్నపుడు అమ్మమ్మ తాతయ్యలు కథలు చెప్పినపుడు మన కలల్లో అందమైన ప్రదేశాల ఊహలు కళ్ళ ముందు మెదిలేవి. అలాంటి అద్భుతాలు ఊహల్లోనో, పిల్లల యానిమేషన్ సినిమాల్లోనో ఉంటాయి. నిజంగా ఎక్కడుంటాయి అనుకుంటే పొరపాటే. మైమరిచిపొయేంత ప్రకృతి సౌందర్యం ఇంకా భూమ్మీద మిగిలే ఉంది. వాటిని ఒక్కసారైనా వెళ్లి చూస్తే జన్మధన్యం అనక తప్పదు. ఇందులో కొన్నింటి వెనుక చందమామ కథల్లాంటి కథలు కూడా ఉన్నాయండోయ్! మరి అవెక్కడున్నాయో తెలుసుకుందామా!!


పారో తక్త్సంగ్ (Paro Taktsang) లేదా టైగర్స్ నెస్ట్ (Tiger's Nest)


ఇది భూటాన్ లో ఒక బౌద్ధ దేవాలయం. చుట్టూ దట్టమైన కొండ గుహల మధ్య నిర్మించిన ఈ ఇల్లులాంటి ఆలయంలో 8 వ శతాబ్దంలో బౌద్ధ గురువు మూడు సంవత్సరాల, మూడు నెలల, మూడు వారాల, మూడు రోజుల, మూడు గంటలు ఇక్కడ ధ్యానం చేసాడని చెప్తారు. 1692 లో నిర్మింపబడిన ఈ కట్టడం ఇప్పటికీ ఎంతో అందంగా కనపడుతోంది. ఇక్కడి నుంచి నేచర్ వ్యూ కోసం ఎంతో మంది ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు.


అందమైన పూలు పూసే విచ్ ట్రీ


నెదర్లాండ్స్(Netherlands)లోని ఒక చాలా ఎత్తైన చెట్టు, పైన నుంచి కింద వరకూ ప్రతీ కొమ్మకొమ్మకూ నిండుగా చెట్టంతా పూలతో ఎంతో అందంగా ఉంటుంది. అయితే, వింతేమిటంటే..ఒకప్పుడు ఈ చెట్టు ఉన్న ప్రాంతంలో ఒక మంత్రగత్తె సమాధి ఉందని అందువల్లే ఇక్కడ ఈ చెట్టు ఇంత నిండుగా పూస్తోందని అక్కడ ఒక కథ ప్రచారంలో ఉంది. ఏది ఏమైనా ఇంత అందమైన చెట్టును చూడటానికి అదృష్టం ఉండాలి.


గుహలో ఆ వెలుతురు ఎక్కడిది?


న్యూజిలాండ్(New Zealand)లోని బ్లూవార్మ్ కేవ్స్(Blue Worm Caves) అని ఉన్నాయి. ఈ గుహల్లో బ్లూ రంగు లైట్ అందంగా మెరుస్తుంటుంది. అది మనుషులు ఏర్పరచిన లైట్ అనుకుంటే పొరపాటే. ఈ గుహల నిండా వెలుతురు పురుగులు నీలం రంగులో మెరుస్తుండటం చూస్తే అబ్బురపడక తప్పదు. ఇలాంటివి సినిమాల్లో కాకుండా నిజంగా ఉన్నాయంటే ఆశ్చర్యమే కదూ!


ఆ ఊర్లో యాభై మందే ఉంటారు 


ఫ్రాన్స్(France)లోని నార్మండీ(Normandy)లో ఒక చిన్న ఐలాండ్ ఉంది. దాని పేరు మోంట్-సెయింట్-మిచెల్(Mont-Saint-Michel). అక్కడ కేవలం 50 మంది మాత్రమే నివసిస్తారు. ఈ ద్వీపం భూమికి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది.


కళ్లున్న చెట్లు


పశ్చిమ ఆఫ్రికాలోని మడగాస్కర్(Madagascar) దేశపు అడవుల్లో బాబాబ్(Baobab) అనే ప్రత్యేకమైన చెట్లు కనిపిస్తాయి. ఈ ప్రాంతానికి ఎంతో మంది యాత్రికులు వస్తుంటారు. ఈ చెట్టు కాండం పై వరకూ పెరిగి పైన్ భాగంలో మాత్రమే ఆకులు విచ్చుకుంటాయి. కొన్ని కొన్ని చెట్ల కాండాలకైతే కళ్లున్నట్లుగా కనపడుతాయి.


నిజమా? సినిమా సెట్టింగా?


కాంబోడియా(Cambodia)లోని ఖ్మెర్(Khmer) బౌద్ధ దేవాలయం 12 వ శతాబ్దంలో నిర్మించారు. అద్భుతమైనా ఆర్కిటెక్చర్ తో నిర్మితమైన ఈ ఆలయం. దట్టమైన చెట్లతో పూర్తిగా కప్పివేసి, ఒక ఎంట్రన్స్ మాత్రమే కనపడేలా ఉంది. ఇది ఫాంటసీ సినిమాల్లో గుహలను తలపిస్తుంది. ఆ ప్రదేశాన్ని చూడటానికి ఎంతో మంది ఏటా వెళ్తున్నా, లోపలికి వెళ్లటానికి మాత్రం జంకుతున్నారట.


Also Read:ఆ చెట్టు ముందు మనిషి నిల్చుంటే చీమలా కనిపిస్తాడు- ఇదే కాదు ఇలాంటి ఎన్నో వింతలు ఈ భూమి మీద ఉన్నాయి 


Also Read: బీరులో నురగ ఎంత శాతం ఉండాలి? పరిశోధనలు ఏం చెప్తున్నాయి?