What Are The Largest Things On Earth: భూమ్మీద మనిషి కంటే పెద్దవి ఎన్నో ఉన్నాయి. సైజ్ పరంగానూ కొన్ని ఈ ప్రకృతిలో మనిషి ఊహకందనంత ఎత్తులో ఎదిగి ఆశ్చర్యపరుస్తున్నాయి. అలాంటి కొన్ని విచిత్రాల గురించి తెలుసుకుందామా!


సాధారణంగా మనిషి ఎత్తు 5 అడుగుల తొమ్మిది అంగులాలు మించదు. అలా కాకుండా 250 అడుగుల ఎత్తైన చెట్టు, గుహలైతే 5.25 మిలియన్ క్యూబిక్ ఫీట్ల పరిమాణంతో కనపడితే ఆశ్చర్యపోకుండా ఉండగలమా? ఇట్లా భూమ్మీద ఎంతో అసాధారణంగా ఎత్తైన, లోతైన, బరువైన వాటి గురించి తెలుసుకుంటుంటే వీటన్నింటి ముందు మనిషి జీవితం చాలా చిన్నది కదా అనిపించక మానదు. 


ప్రపంచంలోనే ఎత్తైన చెట్టు


సికోయా జాతికి చెందిన చెట్లు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనవి. వీటి ఎత్తు 250 అడుగులు. 26 అడుగుల వెడల్పుతో పెరుగుతాయి. ఇవి సియెరా నెవడా పర్వత ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ చెట్టు ముందు నిలుచుంటే మనిషి చీమలా కనిపిస్తాడు. సికోయా జాతికి చెందిన కొన్ని మొక్కలు దాదాపు 3000 సంవత్సరాల వరకు బతుకుతాయి!


పనసకాయ


పండ్ల జాతిలోనే అత్యంత పెద్ద చెట్టు పనస చెట్టు. ఒక్కో కాయ 120 పౌండ్ల వరకు ఉంటుంది. ఒక్కో చెట్టు సంవత్సరానికి 200 నుంచి 500 కాయల వరకు ఇస్తుంది. ఎన్నో న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్న పనసకాయను, దీనిపైన పొట్టును కూడా కూర చేసుకుంటారు. పనసకాయను శాకాహారుల మాంసంగా భావిస్తారు. పనసను మించిన పెద్ద ఫ్రూట్ మరేదీ లేదు.


ఈ పక్షి ఎత్తు ముందు మనిషి దిగదుడుపే


ఇప్పుడు ప్రపంచంలో ఎత్తైన పక్షి ఏది అంటే ఆస్ట్రిచ్ అని చెప్తాం కానీ 60 లక్షల సంవత్సరాల కిందట 11 అడుగుల ఎత్తులో 12 అడుగుల పొడవు రెక్కలతో పక్షులు ఉండేవట! నమ్మశక్యంగా లేదు కదా!! అర్జెంటేవిస్ అనే పేరు గల ఈ పక్షులు అర్జెంటీనాలో ఉండేవట. వాటి ఆహారాన్ని ఈ పక్షులు గాలిలో ఉండే సంపాదించుకోగలిగేవి. వీటి గుడ్లు మాత్రం ఆస్ట్రిచ్ పక్షి గుడ్ల కంటే చిన్నవట.


అత్యంత పొడవైన ఎడారి సహారా కాదట!


అతి పెద్ద ఎడారి ఏదంటే సహారా ఎడారి అని పిల్లల్ని అడిగినా చెప్తారు కానీ నాసా ప్రకారం అత్యంత పొడవైన ఎడారి అంటార్కిటికా ఎడారి. ఎందుకంటే ఇక్కడ వానలు కురవవు. మంచూ పడదు. 5.5 మిలియన్ స్కేర్ మైళ్ల పరిధిలో ఉన్న ఎడారిని దాటడానికి మనిషి జీవితకాలం సరిపోదు.


ఈ పూవు అంత సున్నితం కాదు


పూలంటే వేలి మొనలతో పట్టుకునేంత తేలికగా, సున్నితంగా ఉండాలి కానీ 15 పౌండ్ల బరువున్న పూవును ఎప్పుడైనా చూసారా? ఇది ఇండోనేషియా అడవుల్లో కనిపించే రఫ్లేసియా అర్నోల్డీ మొక్క. పేరుకు మొక్కే కానీ అసలు దీనికి కాండాలు, కొమ్మలు ఏమీ ఉండవు. కేవలం పువ్వు మాత్రమే ఉంటుంది. దీని వాసన కూడా పాడయిపోయిన మాంసంలా ఉంటుంది. అందువల్ల చిన్న పురుగులు వచ్చి వాలినపుడు అవే ఈ ఫ్లవర్ కు ఆహారంగా మారుతాయి.


ఆకాశమంత ఎత్తైన ఇల్లు మన ఇండియాలోనే


4 లక్షల స్క్వేర్ ఫీట్ల ఎత్తులో ఉన్న అతి పెద్ద బిల్డింగ్ ఇండియాలో అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీది. ఈ ఇంటి గ్యారేజ్‌లో 168 కార్లు పడుతాయి. ఇంట్లో 50 సీట్లతో థియేటర్ కూడా ఉందట. అత్యంత అధునాతన వసతులతోపాటు హై స్పీడ్ ఎలివేటర్లు చెప్పుకోదగ్గవి.