బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. భారీ నౌకలో మంటలు చెలరేగి 40 మంది ప్రయాణికులు మరణించారు. ఇంకా వందలాది మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం ఝలోకఠి ప్రాంతంలోని సుగంధ నదిపై చోటుచేసుకున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు దక్షిణంగా 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఝలోకతిలో శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఓడలో దాదాపు 500 మంది ఉన్నారని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు.
Also Read: పెద్దల్ని ఎదిరించిన పెళ్లి చేసుకున్న లవర్స్.. ఉప్పెన సినిమా చూపించిన పేరెంట్స్..
100 మందికి పైగా తీవ్రగాయాలు
బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నుంచి బరుంగా ప్రయాణిస్తోన్న భారీ నౌకలో శుక్రవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఫెర్రీ మూడో అంతస్థులో మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో కొందరు నదిలోకి దూకినట్లు తెలుస్తోంది. మరికొందరు మంటల్లో చిక్కుకుని సజీవంగా దహనమైనట్లు అధికారులు ప్రకటించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 100 మందిని బారిసాల్‌లోని ఆసుపత్రికి తరలించారు. ఫెర్రీ ప్రమాదంలో చాలామంది ప్రయాణికులు మరణించి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలిపారు. ప్రమాదానికి కారణంగా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: చాలా ఏళ్ల శారీరక సంబంధం తర్వాత పెళ్లికి నిరాకరించడం నేరం కాదు.. బాంబే హైకోర్టు తీర్పు !
నౌక ఇంజిన్ రూమ్ లో చెలరేగిన మంటలు
అగ్ని ప్రమాదానికి గురైన నౌక మూడంతస్తులు ఉంటుంది. అందులో 500కి పైగా ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. బరుంగా నుంచి ఝలోకాఠి, భుయన్ మీదుగా ఢాకాకు నౌక ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. నౌక ఝలోకఠి సమీపానికి చేరుకోగానే మంటలు చెలరేగాయి. ముందుగా ఇంజిన్ రూమ్‌లో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. అక్కడ ఇంధనం ఉండడంతో పెద్ద మొత్తంలో మంటలు చెలరేగాయి. మంటల్ని ఆర్పేందుకు సిబ్బంది ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. అక్కడి నుంచి మంటలు క్రమంగా ఫెర్రీ మొత్తం వ్యాపించాయి. ఆ మంటలను చూసి ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలను కాపాడుకునేందుకు కొందరు నదిలోకి దూకారు.
Also Read: దుబాయ్ రాజు విడాకులు.. భార్యకు భరణం ఎన్ని కోట్లు చెల్లించాలో తెలుసా
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి