Amit Shah Update: ఆ కాలం పోయింది.. కశ్మీర్ అభివృద్ధిని ఎవరూ ఆపలేరు: అమిత్ షా

ABP Desam Updated at: 24 Oct 2021 03:40 PM (IST)
Edited By: Murali Krishna

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. జమ్ముకశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. కశ్మీర్ అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని ఈ సందర్బంగా అమిత్ షా అన్నారు.

జమ్ముకశ్మీర్ అభివృద్దిని ఎవరూ ఆపలేరు: అమిత్ షా

NEXT PREV

 


జమ్ముకశ్మీర్‌లో అల్లకల్లోలం సృష్టించాలని ప్రయత్నించేవారిని వదిలిపెట్టేదిలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెచ్చరించారు. జమ్ముకశ్మీర్‌లోని ఐఐటీ-జమ్ము కొత్త క్యాంపస్‌ను ఆయన ప్రారంభించారు.







జమ్ముకశ్మీర్ ప్రజలకు అన్యాయం జరిగే సమయం అయిపోయింది. అది చెప్పేందుకే నేను జమ్ము వచ్చాను. ఎవరూ మీకు అన్యాయం చేయలేరు. ఇక్కడ జరుగుతోన్న అభివృద్ధిని అడ్డుకోవాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారు. కానీ ఇక్కడ జరిగే అభివృద్ధిని ఎవరూ ఆపలేరు. జమ్ముకశ్మీర్.. ఎన్నో ఆలయాలకు నెలవు. మాతా వైష్ణో దేవి ఆలయం ఇక్కడే ఉంది. శ్యామా ప్రసాద్ ముఖర్జీ, ప్రేమ్ నాథ్ డోగ్రా వంటి వారి ప్రాణత్యాగానికి ఈ జమ్ముకశ్మీర్ ప్రతీక. ఇక్కడ అశాంతి నెలకొల్పాలని చూసేవారిని మేం సహించం.                                       -   అమిత్ షా, కేంద్ర హోంమంత్రి


స్థానిక రాజకీయ పక్షాలపై కూడా అమిత్ షా విమర్శలు గుప్పించారు. కశ్మీర్ ప్రజలను ఇన్నాళ్లు దోచుకున్న వారు ఇప్పుడు అభివృద్ధిని ఆపేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.



ఈ ప్రాంతంలో కొత్త పారిశ్రామిక పాలసీని మేం తీసుకొచ్చినప్పుడు మిమ్మల్ని దోచుకున్న మూడు కుటుంబాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. కానీ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం వల్ల ఇప్పటివరకు ఇక్కడికి రూ.12వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 2022లోపు రూ.51వేల కోట్లకు పైగా పెట్టుబడులు ఇక్కడికి వస్తాయి. ఇక్కడున్న యువతకు లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయి.                                            - అమిత్ షా కేంద్ర హోంమంత్రి


జమ్ములో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు అమిత్ షా నేడు శంకుస్థాపన చేశారు. భాజపా ఎమ్మెల్యే, ఎంపీలు, స్థానిక నేతలతో అమిత్ షా భేటీ కానున్నారు. జమ్ములో ఉన్న గురుద్వారాను కూడా మోదీ సందర్శించనున్నారు.


Also Read: Covid-19 New variant: కరోనా మరో అవతారం.. ఏవై. 4.2.. ఇది చాలా ఫాస్ట్ గురూ! మరి భారత్‌కు వచ్చేసిందా?


Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 15 వేల కేసులు నమోదు, 561 మంది మృతి


Also Read: ఈ క్రికెటర్లు రిచ్చో రిచ్చు! టీ20 ప్రపంచకప్‌ ఆడేస్తున్న కోటీశ్వరులు వీరే!


Also Read: ఐపీఎల్‌ క్రేజ్‌కు ఫిదా! కొత్త ఫ్రాంచైజీపై 'మాంచెస్టర్‌ యునైటెడ్‌' ఆసక్తి!


Also Read: పాక్‌వి గంభీరమైన ప్రేలాపనలే! దాయాదిపై భారత జైత్రయాత్రకు కారణాలు చెప్పిన వీరూ


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at: 24 Oct 2021 03:37 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.