ప్రతి ఇంట్లో కనీస ప్రాథమిక వస్తువుగా ఉండే అగ్గి పెట్టెల ధరలు రెట్టింపయ్యాయి. దీంతో దాదాపు 14 ఏళ్ల తర్వాత ధర ఒక్కసారిగా డబుల్ అయినట్లయింది. ఇప్పటివరకు చిన్న అగ్గిపెట్టెలను రూ.1కి అమ్ముతున్నారు. తాజాగా డిసెంబరు 1 నుంచి ఆ అగ్గి పెట్టెలను రూ.2 కి విక్రయిస్తామని తయారీ సంస్థలు ప్రకటించాయి. మండే అగ్గిపుల్లల తయారీలో వినియోగించే 14 రకాల ముడి పదార్థాల ధరలు పెరగడమే ఇందుకు కారణమని వివరించాయి. ముడి పదార్థాల్లో వాడే రెడ్‌ ఫాస్ఫరస్‌ ధర రూ.425 నుంచి రూ.810కి, మైనం ధర రూ.58 నుంచి రూ.80కి పెరిగిందని తయారీ సంస్థలు వివరించాయి. అగ్గిపెట్టె తయారీదార్లకు సంబంధించి 5 సంఘాలు శివకాశీలో సమావేశమై, ధరలు పెంచాలని నిర్ణయించాయి. ఒక అగ్గిపెట్టె ధరను 50 పైసల నుంచి రూ.1కి పెంచుతూ 2007లో నిర్ణయం తీసుకోగా, మళ్లీ ఇప్పుడు పెంచుతున్నారు.


Also Read: Amazon Festival Sale: ఫిట్‌నెస్‌, యోగా యాక్ససరీస్‌.. ఇప్పుడు రూ.49కే మొదలు


బాక్స్‌ బోర్డులు, పేపర్‌, పొటాషియం క్లోరేట్‌, గంధకం వంటి ధరలు కూడా  పెరగడమే కాకుండా.. ఇంధన ధరల ప్రభావం కూడా ఓ కారణమని వివరించారు. ఇప్పటివరకు 600 అగ్గిపెట్టెల బాక్సును రూ.270-300కి తయారీదార్లు విక్రయిస్తుండగా, ఇకపై రూ.430-480కి పెంచాలని నిర్ణయించినట్లు నేషనల్‌ స్మాల్‌ మ్యాచ్‌బాక్స్‌ మాన్యుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌ సెక్రటరీ వీఎస్ సేతురథినమ్‌ తెలిపారు. దీనికి అదనంగా 12 శాతం జీఎస్‌టీ, రవాణా ఛార్జీలు కూడా ఉంటాయని వివరించారు. తమిళనాడులో అగ్గిపెట్టెల తయారీ పరిశ్రమపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా 4 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. 


‘‘ధరలను 60 శాతం  పెంచి రూ. 430–480 కి అమ్మాలని నిర్ణయించుకున్నాం. ఈ రేటులో 12 శాతం జీఎస్‌‌‌‌‌‌‌‌టీ, రవాణా ఖర్చులు కలిసుండవు’ అని అసోసియేషన్‌ సెక్రటరీ వీఎస్ సేతురథినమ్‌ తెలిపారు. ప్రస్తుతం అగ్గిపెట్టెల ఇండస్ట్రీ తమిళనాడులో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్న ఈ ఇండస్ట్రీ కూలీల కొరత ఎదుర్కొంటోంది. చాలా మంది ఎక్కువ వేతనాలు ఇచ్చే ఉపాధి పనులవైపు మళ్లుతున్నట్లుగా సంఘం ప్రతినిధులు తెలిపారు.


Also Read: రిలయన్స్‌ అంటే అంతే మరి! క్యూ2 ఫలితాల్లో దుమ్మురేపిన ఆర్‌ఐఎల్‌.. లాభం ఎంతో తెలుసా?


Also Read: కస్టమర్లకు ఆఫర్లే ఆఫర్లు! దీపావళికి ఏ బ్యాంకు ఏ ఆఫర్‌ ఇస్తోందో తెలుసా?


Also Read: మీ కలల్ని మించిన ధనవంతులు అవ్వండి.. అందుకు నిజంగా ఏం చేయొద్దు, పూర్తి వివరాలివీ..


Also Read: కేంద్ర ఉద్యోగులకు తీపికబురు! డీఏ, డీఆర్‌ పెంపునకు ప్రభుత్వ ఆమోదం


Also Read: కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. మరో 6 నెలలపాటు పాలసీ కొనసాగిస్తూ కీలక నిర్ణయం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి