బల్మూరి వెంకట్ స్థానికేతరుడు అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యాలపై రేవంత్ రెడ్డి కరీనంగర్ లో మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు తమ నియోజకవర్గాలకు అనామకులే అని విమర్శించారు. పోలీసులు ఎన్నికల్లో భాగంగా నిజాయితీగా విధులు నిర్వర్తించడం లేదని.. రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈటలను చీకట్లో కలిశానని లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 


తెలంగాణలో పోలీసు విభాగం రెండు భాగాలుగా విడిపోయిందని రేవంత్ ఆరోపించారు.  డీజీపీ ఫోన్‌ కూడా ట్యాప్‌ అవుతోందన్నారు. నర్సింగరావు డీజీపీపై.. వేణుగోపాల్‌రావు తమపై నిఘా పెట్టారని రేవంత్‌ రెడ్డి అన్నారు. ప్రవీణ్‌కుమార్‌ వేరే పార్టీలో చేరితే.. ఆయన సామాజికవర్గ అధికారులను వేధిస్తున్నారని చెప్పారు. తెలంగాణ కోసం కేసీఆర్ కుటుంబంలో ఆత్మత్యాగాలెవరు చేశారని రేవంత్‌ ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీలో అంతర్గాత పోరు స్టార్ట్ అవుతుందని రేవంత్ అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే.. నక్సలైట్లు ఉన్నా..  అయిపోయేదని వ్యాఖ్యానించారు. ప్రజాప్రతినిధిగా అది కోరుకోవద్దని కానీ.. వాళ్లు ఉంటే.. అయినా ప్రభుత్వం భయపడేదని చెప్పారు. 


తెలంగాణను టీఆర్ఎస్ ప్రభుత్వం తాగుబోతులకు అడ్డాగా మార్చిందని టీపీసీసీ అధ్యక్షుడు ఆరోపించారు. యువతను మత్తు వైపు ప్రేరేపించి.. ప్రశ్నించకుండా చేస్తున్నారని తెలిపారు. పెట్రోలు, డీజిల్​ ధరలు అడ్డగోలుగా పెంచారని చెప్పారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు.  పంపకాల్లో తేడాతోనే హుజూరాబాద్‌ ఉపఎన్నిక వచ్చిందని అన్నారు. దళిత బంధు, పేదల ఇళ్ల కోసం ఈటల రాజీనామా చేయలేదని రేవంత్ విమర్శించారు. అభ్యర్థులు లోకల్, నాన్ లోకల్  అని చెబుతున్నారు.. కానీ సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేటలో పోటీచేసిన వాళ్లు స్థానికులా? అని ప్రశ్నించారు. దుబ్బాక, హుజూర్‌నగర్, సాగర్‌లో ఇచ్చిన హామీలేమయ్యాయని రేవంత్​ అడిగారు.


జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిపిస్తే.. వరదల్లో కోల్పోయిన వాటిని ఇస్తామని చెప్పినా.. బండి సంజయ్ ఏమైందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడైనా.. బీజేపీ ఫ్లేక్సిల్లో ఒక్క ఫొటో లేదు ఏంటని అడిగారు. బీజేపీలోనూ అంతర్గాతంగా కుమ్ములాటలు ఉన్నాయని విమర్శించారు.


హుజూరాబాద్ నియోజకవర్గంలో ఏ ఒక్క సమస్యపై కూడా చర్చ జరగలేదని రేవంత్ రెడ్డి అన్నారు. ఇద్దరు వ్యక్తులు, రెండు పార్టీలు పోటాపోటీగా కేవలం ఎన్నికలు, ఫిరాయింపులు, కొనుగోళ్లు, వ్యసనాలు, తాగుబోతులకు అడ్డాగా చేశారు. టీఆర్ఎస్, బీజేపీ తెలంగాణ సంస్కృతిని చిన్నాభిన్నం చేసి తెలంగాణ సమాజాన్ని ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టారన్నారు.


Also Read: Revanth Reddy: ఈటలతో సమావేశం బహిరంగ రహస్యం... కేటీఆర్ వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి కౌంటర్


Also Read: Telangana Drugs: తెలంగాణలో డ్రగ్స్ కలకలం... రూ. 2 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు స్వాధీనం... స్టూడెంట్స్ లక్ష్యంగా దందా...!