తెలంగాణ మేడ్చల్ జిల్లాలోని రూ.2 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో భాగంగా ఓ కారులో మెపిడ్రిన్ డ్రగ్స్ ను ఎక్సైజ్ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కారులో డ్రగ్స్ తరలిస్తోన్న పవన్, మహేందర్‌రెడ్డి, రామకృష్ణగౌడ్ అనే ముగ్గురు యువకులను అరెస్టు చేశారు. ప్రధాన నిందితులు ఎస్.కె.రెడ్డి, హనుమంతరెడ్డి పరారీలో ఉన్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. నిందితులను పోలీసులు మీడియా ముందు హాజరుపరిచారు. విద్యార్థులకు సరఫరా చేయడానికి డ్రగ్స్ తీసుకెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో కూకట్‌పల్లిలో పవన్ అనే వ్యక్తి వద్ద డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారంతో మేడ్చల్‌లోని మహేశ్‌రెడ్డి ఇంట్లో కూడా పోలీసులు సోదాలు చేశారు. మహేశ్ వద్ద 926 వద్ద మెపిడ్రిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహేశ్ ఇచ్చిన సమాచారంతో నాగర్‌కర్నూల్ కు చెందిన ఓ వ్యక్తి ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. మొత్తం మూడు ప్రాంతాల్లో 4.92 కిలోల డ్రగ్స్, ఓ కారును అధికారులు సీజ్ చేశారు.
Also Read: బిడ్డ తన పోలికలతో పుట్టలేదని చంపేసిన తండ్రి.. అనంతరం మరో ఘోరం
కొరియర్ లో డ్రగ్స్ తరలింపు
హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ కొరియర్ ఆఫీసులో ఎన్సీబీ అధికారులు 3 కిలోల మాదకద్రవ్యాలను పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియాకు చేసిన పార్శిల్ ద్వారా పంపిస్తున్నట్లు గుర్తుంచారు. సమాచారం తెలిసిన ఎన్సీబీ అధికారులు దాడులు చేశారు. పార్సిల్లో చీరల లోపల డ్రగ్స్ పాకెట్లు ఉన్నట్లు గుర్తించారు. అనుమానం రాకుండా చీరల ఫాల్స్‌లో డ్రగ్స్ పెట్టి కుట్టేసి కొరియర్ చేసేందుకు సిద్ధమయ్యారు. కొరియర్ ఆధారంగా వివరాలను పరిశీలించగా చెన్నైకు చెందిన వ్యక్తిగా ఎన్సీబీ అధికారుల దర్యాప్తులో తేలింది. కొరియర్ కార్యాలయంలో వివరాల ఆధారంగా ఎన్సీబీ అధికారులు చెన్నై వెళ్లారు. అక్కడి ఆరా తీయగా నకిలీ గుర్తింపు అడ్రస్ ఇచ్చినట్లు గుర్తించారు. సాంకేతికతను ఉపయోగించుకొని ఎన్సీబీ అధికారులు కొరియర్ చేసిన వ్యక్తిని అరెస్టు చేశారు.
Also Read: మైనర్ అత్యాచారం కేసులో మరో టిస్ట్.. పోలీసులు తనను బెదిరించారని బాలిక ఆరోపణ..!
బెంగళూరు నుంచి డ్రగ్స్
బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ తరలిస్తున్న మరో ముఠాను ఎన్సీబీ అధికారులు దేవనహల్లి టోల్ గేట్ వద్ద అరెస్టు చేశారు. కారులో వెళ్తోన్న ఓ వ్యక్తిని అరెస్టు చేసిన బెంగళూరు ఎన్సీబీ అధికారులు అతను నుంచి సమాచారం రాబట్టారు. ఆ సమాచారంతో మరో ముగ్గురిని అరెస్టు చేశారు. నిందితులు బెంగళూరు నుంచి డ్రగ్స్ ను తీసుకొచ్చి హైదరాబాద్‌లోని పబ్బుల్లో విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. నిందితుల్లో హైదరాబాద్‌కు చెందిన యువకుడితో పాటు ఏపీ, బీహార్‌కు చెందిన ముగ్గురు ఉన్నారు.
Also Read: మహిళ వాట్సాప్ కు నీలి చిత్రాలు... కిటికీ దగ్గర వింత అరుపులు... యువకుడి వెకిలి చేష్టలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి