ప్రపంచ దేశాల్లో కరోనా కల్లోలం ఇంకా కొనసాగుతూనే ఉంది. రకరకాల రూపాలను మార్చుకుని ప్రపంచ దేశాలను కరోనా భయపెడుతోంది. అయితే తాజాగా యూకేలో వెలుగులోకి వచ్చిన ఏవై. 4.2 హడలెత్తిస్తోంది. ఇప్పటి వరకు ఉన్న వేరియంట్లకు భిన్నంగా అత్యంత వేగంగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఈ వేరియంట్‌పై భారత్ కూడా హై అలర్ట్‌లో ఉంది. డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఇది ఊహించనంత వేగంగా వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.
భారత్‌లో ఉందా?
భారత్‌లో ఇప్పటివరకు ఈ ఏవై. 4.2 వైరస్ గుర్తులు కనబడలేదు. ఇప్పటివరకు 68 వేలకు పైగా శాంపిల్స్‌ను పరీక్షించగా ఈ వేరియంట్ అందులో లేదు.
యూకేలో హడల్..
కరోనా వైరస్‌లో ఒక వేరియంట్ డెల్టా వేరియెంట్. అయితే ఇపుడు దీని ఉపవర్గమైన ఏవై. 4.2 బ్రిటన్‌లో అల్లకల్లోలం సృష్టిస్తోంది. కరోనా వైరస్‌లోని స్పైక్ ప్రొటీన్ మ్యూటేషన్లు అయిన ఏ222 వీ, వై145 హెచ్‌ల సమ్మేళనంగా ఏవై. 4.2 పుట్టిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వైరస్ కారణంగా రోజురోజుకీ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ వేరియెంట్ తొలి సారిగా జూలైలో యూకేలో బయటపడింది.
ఇదే వేరియెంట్ కేసులు అమెరికా, రష్యా, ఇజ్రాయెల్‌లో కూడా నమోదవుతున్నాయి. డెల్టా వేరియెంట్ వెలుగులోకి వచ్చిన అనంతరం ఇప్పటి వరకూ 55 సార్లు జన్యుపరమైన మార్పులు చేసుకుంది. అయితే ఇప్పటివరకూ అవి పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ ఇప్పుడు ఏవై.4.2 వేగంగా వ్యాప్తి చెందుతోంది.
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 15 వేల కేసులు నమోదు, 561 మంది మృతి
Also Read: ఈ క్రికెటర్లు రిచ్చో రిచ్చు! టీ20 ప్రపంచకప్ ఆడేస్తున్న కోటీశ్వరులు వీరే!
Also Read: ఐపీఎల్ క్రేజ్‌కు ఫిదా! కొత్త ఫ్రాంచైజీపై 'మాంచెస్టర్ యునైటెడ్' ఆసక్తి!
Also Read: పాక్‌వి గంభీరమైన ప్రేలాపనలే! దాయాదిపై భారత జైత్రయాత్రకు కారణాలు చెప్పిన వీరూ