టాలీవుడ్ ఇప్పుడు కష్టాల సుడిగుండంలో ఉంది. పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. కానీ రిలీజ్ చేస్తే ఏదో ఒక రాష్ట్రంలోనే మాత్రమే కలెక్షన్లు వస్తాయి. ఎందుకంటే ఏపీలో సినిమాల విడుదలపై ఎన్నో ఆంక్షలు ఉన్ాయి. టిక్కెట్ రేట్ల దగ్గర్నుంచి షోల వరకూ ఏ సమస్యా పరిష్కారం కాలేదు. ఒకే రాష్ట్రంలో విడుదల చేసుకుంటే భారీ నష్టాలు ఎదురవుతాయి. అందుకే సినీ పెద్దలు ఆలోచిస్తున్నారు. కష్టాలు తీర్చాలని మెగాస్టార్ చిరంజీవి లవ్ స్టోరీ ప్రి రిలీజ్ ఫంక్షన్ వేదికగా కోరారు. కానీ అలా కోరితే ప్రభుత్వాలు స్పందిస్తాయా..? నేరుగా వెళ్లి సమస్యలను పరిష్కరించాలని ఎందుకు కోరడం లేదు ?


Also Read : నాన్నకు ప్రేమతో నాగార్జున..పంచెకట్టు వైభవాన్ని తిరిగి తీసుకొచ్చేందుకే ఈ ప్రయత్నం అంటున్న ‘బంగార్రాజు’


ఇండస్ట్రీ అంటే నలుగు హీరోలు కాదు.. లక్షల మంది కార్మికులు కూడా !  
నలుగురు హీరోలు బాగుంటే సినీ పరిశ్రమ మొత్తం బాగున్నట్లు కాదని లక్షల మంది కార్మికులకు రోజువారీ పని దొరకాలని  లవ్ స్టోరీ సినిమా ప్రి రిలీజ్ వేడుకలో చిరంజీవి అన్నారు. చిరంజీవి చెప్పినా చెప్పకపోయినా అది నిజమే. అన్ని ఇండస్ట్రీల్లాగనే సినీ ఇండస్ట్రీ. కింది స్థాయి వరకూ అనేక మంది ఉపాధి పొందుతూ ఉంటారు. కరోనా దెబ్బకు ఇండస్ట్రీ కూడా పూర్తిగా దెబ్బతినిపోయింది. కింది స్థాయి వర్కర్లకు పని దొరకడం కష్టమైపోయింది. ఇప్పుడిప్పుడే పరిస్థితి మెరుగుపడుతున్న దశలో ప్రభుత్వాల నుంచి ఎదురవుతున్న సవాళ్లు చిత్ర పరిశ్రమకు గండంగా మారాయి.


Also Read : బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ హీరో.. అవార్డులన్నీ కొట్టేసిన 'అల.. వైకుంఠపురములో..'


తెలంగాణలో ఓకే - ఏపీలోనే అనేక ఆంక్షలు.. ! 
తెలంగాణలో సినిమాల విడుదలకు ఎలాంటి సమస్యా లేదు. ప్రభుత్వం అన్నింటితో పాటు సినీ పరిశ్రమకు పూర్తి స్థాయి అనుమతులు ఇచ్చింది. టిక్కెట్ రేట్ల విషయంలోనూ ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు, షోల విషయంలోనూ కొత్తగా నిబంధనలు పెట్టలేదు. ఓ రకంగా తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమకు పూర్తి స్తాయిలో సహకరిస్తోంది. అయితే సినిమాలు విడుదల కావడం లేదు. చిన్న సినిమాలు మాత్రం విడుదల అవుతున్నాయి.


Also Read : సాయిపల్లవిని చూస్తూ ఉండిపోయా.. సినిమా ఆఫర్ ఇస్తే రిజెక్ట్ చేసింది.. చిరు మాటలకు హీరోయిన్ షాక్..


ఏపీలో అనేక రకాల ఆంక్షలు ! 
సినిమాల విడుదలకు ఏపీలో అనేక రకాల ఆంక్షలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. నైట్ కర్ఫ్యూ కొనసాగిస్తున్నందున మూడు షోలకు మాత్రమే అనుమతి ఉంది. అది కూడా వంద శాతం టిక్కెట్ల అమ్మకానికి చాన్స్ లేదు. యాభై శాతం మాత్రమే టిక్కెట్లు అమ్ముకోవాలి. అదే సమయంలో టిక్కెట్ రేట్లపై నియంత్రణ ఉంది. వకీల్ సాబ్ సినిమా రిలీజ్ సమయంలో టిక్కెట్ రేట్లను ఖరారు చేస్తూ జీవో తెచ్చారు. ఆ జీవో ప్రకారం రేట్లు ఏ మాత్రం గిట్టుబాటు కావని ఎగ్జిబిటర్లు చాలా మంది ధియేటర్లు తెరవడం మానేశారు. ఈ సమస్యలన్నీ పరిష్కారం కాలేదు.  ఈ లోపు టిక్కెట్లను తామే అమ్ముతామంటూ ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. ఈ సమస్యలన్నింటి మధ్య సినీ పెద్దలతో  సీఎం జగన్ సమావేశం అవుతారన్న ప్రచారం జరిగింది కానీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది.


Also Read : ఒక్కో కంటెస్టెంట్ రెమ్యునరేషన్ ఎంతంటే..?


సమస్యలు చెప్పుకునేందుకు ఏపీ సీఎం అవకాశం ఇవ్వడం లేదా ? 
గత నెలలో ఓ రోజు మంత్రి పేర్ని నాని చిరంజీవికి ఫోన్ చేసి టాలీవుడ్ పెద్దలతో సీఎం జగన్ సమావేశం కావాలనుకుంటున్నారని నెలాఖరు అపాయింట్‌మెంట్ ఉంటుందని చెప్పారు. మధ్యలో పేర్ని నాని వచ్చి చిరంజీవి బృందంతో సమావేశమయ్యారు. చిరంజీవి కూడా సినీ ఇండస్ట్రీ వర్గాలతో సమావేశమై సమస్యల చిట్టాను రెడీ చేసుకున్నారు. ఆ తర్వాత అపాయింట్‌మెంట్ గురించి ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. ఓ సారి నాలుగో తేదీన భేటీ అన్నారు. మరోసారి ఇరవయ్యో తేదీన భేటీ అన్నారు. కానీ అన్నీ పుకార్లుగానే మిగిలిపోయాయి. ఇరవయ్యో తేదీన పేర్ని నాని కొంత మంది ఎగ్జిబిటర్లు ఇతరులతో సినిమా టిక్కెట్ల అంశంపై చర్చించే సమావేశం మాత్రం నిర్వహిస్తున్నారు. దీంతో  టాలీవుడ్ పెద్దలకు తమ సమస్యలను చెప్పుకునే అవకాశం దక్కడంలేదు. అందుకే సినీ ఫంక్షన్ వేదికగా చిరంజీవి తన వాదన వినిపించారన్న అభిప్రాయం వినిపిస్తోంది.


Also Read : ఒక్క సీజన్‌కు రూ.350 కోట్లు.. ఈయన చాలా కాస్ట్లీ గురూ!


టిక్కెట్ల పోర్టల్‌ని సినీ పెద్దలే కోరారంటున్న ఏపీ ప్రభుత్వం - మరి మిగతా సమస్యల గురించి పెద్దలు చెప్పలేదా? 
టిక్కెట్లను ప్రభుత్వమే అమ్మాలని చిరంజీవి, నాగార్జున వంటి వారు కోరారని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అందుకే తాము జీవో తీసుకొచ్చి.. ప్రత్యేకంగా సినిమా పోర్టల్ ద్వారా టిక్కెట్లు అమ్ముతామని కూడా చెబుతోంది. ఈ అంశంపై చిరంజీవి, నాగార్జున కూడా స్పందించలేదు. వారు నిజంగా అలా కోరి ఉంటారని అందుకే స్పందించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సినిమా టిక్కెట్లను కూడా ప్రభుత్వమే ‌అమ్మడం సినిమా ఇండస్ట్రీ సమస్యల పరిష్కారంలో భాగం అయితే ఇతర సమస్యల గురించి చిరంజీవి ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదన్న చర్చ టాలీవుడ్‌లో జరుగుతోంది.


చిరంజీవిపైనే భారం !
దాసరి నారాయణరావు తర్వాత టాలీవుడ్‌కు పెద్దగా చిరంజీవిని అందరూ భావిస్తున్నారు. చిరంజీవి రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఆయనే ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి పరిశ్రమను ఆదుకునేలా ఉపశమనం తీసుకొస్తారని నమ్ముతున్నారు. ఎందుకనో కానీ ఏపీ ప్రభుత్వం భేటీలు అంటూ ప్రకటిస్తోంది కానీ అపాయింట్‌మెంట్లు ఇవ్వడం లేదు. ఏపీ ప్రభుత్వంతో ఉండే సమస్యలను ప్రధానంగా పరిష్కరించుకున్నప్పుడే టాలీవుడ్ కష్టాలు తీరుతాయన్న అభిప్రాయం సినీ పరిశ్రమలో వ్యక్తమవుతోంది. 


Also Read : హాస్పిటల్ లో సాయి ధరమ్ తేజ్.. కానీ సినిమా రిలీజ్ పక్కా..