హెరాయిన్‌ను తరలిస్తున్న ఏడుగురిని గుజరాత్ ముంద్రా పోర్టులో అధికారులు అరెస్టు చేశారు. అయితే ఈ డ్రగ్స్ ముఠాకు విజయవాడతో సంబంధాలు ఉండడం గమనార్హం. నిఘా వర్గాల సమాచారంతో డీఆర్‌ఐ అధికారులు గుజరాత్ లోని ముంద్రా పోర్టుకు చేరుకున్న కంటైనర్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని తనిఖీ చేయగా దాదాపు 9 వేల కోట్ల రూపాయల విలువైన హెరాయిన్ పట్టుబడింది. 


అఫ్గానిస్థాన్‌లోని కాందహార్ కేంద్రంగా పనిచేస్తున్న హసన్ హుస్సేన్ లిమిటెడ్ సంస్థ నుంచి టాల్కమ్ పౌడర్ తోపాటు  డ్రగ్స్ వచ్చాయి. ఈ కంటైనర్లు అఫ్గాన్ నుంచి వచ్చినప్పటికీ, ఇవి ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడకు చెందిన ఓ ట్రేడింగ్ సంస్థకు చెందినవిగా గుర్తించారు. టాల్కమ్ పౌడరు ముసుగులో డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. పట్టుబడిన మాదక ద్రవ్యాల విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో కొన్ని వందల కోట్ల వరకు ఉంటుందని అధికారులు చెప్పారు. 


విజయవాడలోని ఆషీ ట్రేడింగ్‌ సంస్థకు డ్రగ్స్‌ రవాణా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి చెన్నైలో మాచవరం సుధాకర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.  విజయవాడలోని ఆషీ సంస్థ వ్యాపార లావాదేవీలు, కార్యకలాపాలపై ఆరా తీస్తున్నారు. ఆగస్టు 18న ఆషీ ట్రేడింగ్‌ కంపెనీ రిజిస్టర్‌ అయినట్లు.. ఎం.సుధాకర్‌ అనే వ్యక్తి పేరు మీద ఫోన్‌ నంబర్‌ నమోదై ఉందని అధికారులు గుర్తించారు. కాకినాడకు చెందిన సుధాకర్‌ ఎనిమిదేళ్లుగా చెన్నై శివారులో నివాసం ఉంటున్నారు. ఆషీ ట్రేడింగ్ సంస్థ మూలాలు కాకినాడ, విజయవాడ, చెన్నైవరకూ విస్తరించినట్లు అధికారులు చెబుతున్నారు.


విజయవాడ సత్యనారాయణపురంలోని ఓ చిరునామాతో ఆషీ ట్రేడింగ్‌ కంపెనీ రిజిస్టర్‌ అయింది.  ఆ కంపెనీ రిజిస్ట్రేషన్‌ అయ్యే సమయంలో ఫోన్‌ నంబర్‌ మాత్రం సుధాకర్‌ అనే వ్యక్తిపై ఉంది. డ్రగ్స్‌ రవాణాకు సంబంధించి విజయవాడ చిరునామా ఉండటంతో దృష్టిసారించారు ఏపీ పోలీసులు. విజయవాడ సత్యనారాయణపురంలో దర్యాప్తు చేపట్టారు.


 


Also Read: White Challenge : డ్రగ్స్ కేసుల చుట్టూ తిరుగుతున్న తెలంగాణ రాజకీయాలు ! వైట్ చాలెంజ్‌లో గెలుపెవరిది?


Also Read: RMP Doctor: ఒక్క ముద్దుకు రూ.25 వేలు, ఆస్పత్రి రెంట్ కూడా.. ఆర్ఎంపీ డాక్టర్‌కు ఆఫర్.. చివరికి..


Also Read: Crime News: స్టూడెంట్ బుగ్గ కొరికిన హెడ్ మాస్టర్…స్కూల్లోనే ఉతికి ఆరేసిన తల్లిదండ్రులు


Also Read: Crime News: గర్భం దాల్చిన మహిళ.. విషయం తెలిసి ఇద్దరు ప్రియుల ఫైటింగ్.. ఇందులో అసలు ట్విస్ట్ ఏంటంటే..