జీవితాలు పాడైపోతున్నాయి, కాపురాలు కూలిపోతున్నాయి, కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి..ఎన్ని జరుగుతున్నా..నిత్యం ఎన్ని ఘటనలు చూస్తున్నా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు ఉండడం లేదు. తప్పు చేసి తలదించుకోవాల్సిన సమయంలోనూ తలెగరేస్తున్నారు. న్యాయం కావాలంటూ పోరాటాలు చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు. అసలు  పుట్టబోయే బిడ్డ కోసం పోటీ పడటం ఎక్కడైన చూశామా. ఒక వేళ చూసినా  భార్యభర్తలు  విడిపోయే పరిస్థితి వస్తే అప్పుడు పిల్లలు నాక్కావాలి అంటే నా దగ్గరే ఉండాలనే పరిస్థితి వస్తుంది. కానీ భర్త ఉండగా..ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకోసం ఇద్దరు ప్రియులు కొట్టుకోవడం అంటే ఏమనుకోవాలి. తమిళనాడులో జరిగిన ఈ ఘటన గురించి తెలుసుకుని అంతా నోరెళ్లబెడుతున్నారు. అంతా కలికాలం అంటున్నారు.


ALso Read: ఆ నాలుగు రాశులవారికి మినహా మిగిలిన వారికి ఈ రోజంతా శుభసమయమే…ఏ రాశిఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..


ఏం జరిగిందంటే తమిళనాడు సేలం జిల్లా అయోధ్య నగరం రామ్‌నగర్‌ కాలనీకి చెందిన మురుగేశన్‌ రెండో భార్య కలైమణి. అదే ప్రాంతానికి చెందిన కలై అరసన్‌, కృపై రాజ్‌ తో ఒకరికి తెలియకుండా మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆమె గర్భవతి అయింది. ఈ శుభవార్త విని భర్త మురుగేశన్ సంతోషించాడు. అయితే కలైమణి తాను గర్భవతినని ఇద్దరు ప్రియులకు చెప్పింది. వాళ్లిద్దరూ ఒకేసారి ప్రియురాలి ఇంటికి వచ్చారు. ఒకర్నొకరు చూసుకుని కలైమణి కడుపులో బిడ్డకి తండ్రిని తానంటే తానని  వాదించుకున్నారు. వాదన కాస్త దాడుల వరకూ వెళ్లింది.  కలైఅరసన్‌ కత్తితో కృపైరాజ్‌పై దాడి చేసి చంపేశాడు. జరుగుతున్న రచ్చంతా చూస చుట్టుపక్క వారుపోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కలైమణి, కలై అరసన్‌‌ను అరెస్టు చేసి కేసునమోదు చేశారు. స్థానికంగా ఈ ఘటన కలకలం చర్చనీయాంశమైంది.


Also Read: అలర్ట్..అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో ఇవాాళ వర్షాలు..


బంధం, నమ్మకం, ప్రేమ..వీటి అర్థాన్ని పూర్తిగా మార్చేస్తున్నారు..నైతికతన వదిలేస్తున్నారు అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటున్నారు మానసిక నిపుణులు. క్షణికానందంకోసం క్షణికావేశంలో ఏ చేస్తున్నారో విచక్షణ కోల్పోతున్నారని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా  భార్య-భర్త-ఇద్దరు ప్రియుల రచ్చ మాత్రం చర్చనీయాంశమవుతోంది.


ALso Read: ఈ వారం ఈ రాశులవారికి చాలా ప్రత్యేకం..వీరు శుభవార్తలు వింటారు..ఆ రాశుల వారు మాత్రం దూర ప్రయాణాలు ప్లాన్ చేసుకోపోవడం మంచిది


Also Read: ఆందోళన చెందవద్దు.. వారికి సైతం రూ.10 లక్షలు వచ్చేలా చూస్తాం.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క


Also Read: సాయిపల్లవిని చూస్తూ ఉండిపోయా.. సినిమా ఆఫర్ ఇస్తే రిజెక్ట్ చేసింది.. చిరు మాటలకు హీరోయిన్ షాక్..


Also Read: స్థిరంగా పసిడి ధరలు.. దిగొచ్చిన వెండి.. మీ ప్రాంతాల్లో తాజా రేట్లు ఇలా..