2021 సెప్టెంబరు 20 సోమవారం రాశిఫలాలు


మేషం


ఈ రోజు మేషరాశివారికి సత్ఫలితాలున్నాయి. ఏ పని ప్రారంభించినా సక్సెస్ ఫుల్ గా పూర్తిచేస్తారు. ఉద్యోగస్తులు ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. స్నేహితుల సహకారం ఉంటుంది. కుటుంబ సభ్యులతో వీలైనంత సామరస్యంగా వ్యవహరించండి.


వృషభం


వృషభ రాశివారు  ఈ రోజు తీసుకునే నిర్ణయాలు కలిసొస్తాయి. ముఖ్యమైన పనుల్ని పూర్తిచేయగలుగుతారు. శ్రమ, ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. ఉద్యోగస్తులకు అనుకూల సమయం. ఇతరులతో ఓర్పుగా వ్యవహరించండి.


మిథునం


ఇంటా-బయటా మిథున రాశివారికి అనుకూల సమయం. మీ తెలివితేటలతో ఓ సమస్య నుంచి బయటపడతారు. వ్యాపారస్తులకు శుభసమయం. ఉద్యోగస్తులు మరో మెట్టు పైకెక్కే అవకాశం ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది.


ALso Read: ఈ వారం ఈ రాశులవారికి చాలా ప్రత్యేకం..వీరు శుభవార్తలు వింటారు..ఆ రాశుల వారు మాత్రం దూర ప్రయాణాలు ప్లాన్ చేసుకోపోవడం మంచిది


కర్కాటకం


మీకు భలే మంచి రోజు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులు కార్యాలయంలో ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారులకు లాభాలొచ్చే అవకాశం ఉంది. చిన్న చిన్న సమస్యలకు, అవరోధాలకు ఆందోళన చెందకండి. ఈ రోజంతా సంతోషంగా ఉంటారు.


సింహం


సింహ రాశివారికి ఈరోజు మిశ్రమ ఫలితాలున్నాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. కొత్త ప్రణాళికలు వేసుకునేందుకు అనుకూల సమయం. కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారంతో ముందడుగేస్తారు.  ఓర్పుగా వ్యవహరించండి. ఆర్థిక సమస్యలు వెంటాడతాయి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు.


కన్య


కన్యా రాశివారికి ఈ రోజు ఆర్థికంగా కలిసొస్తుంది. వ్యాపారంలో స్నేహితుల, కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఉద్యోగస్తులకు సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. చేపట్టిన పనులన్నీ పూర్తిచేయగలుగుతారు. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.


Also Read: నిమజ్జనం వేళ Hyd విహంగ వీక్షణం, మెట్రో ఒంపుసొంపులతో అందమైన సిటీని పైనుంచి చూడండి


తుల


తుల రాశివారు అప్రమత్తంగా ఉండాల్సిన రోజిది. వ్యాపారంలో నష్టాలొచ్చే సూచనలున్నాయి అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగస్తులు తమ పనిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త..వాహన ప్రమాదం జరుగుతుందనే హెచ్చరికలున్నాయి. మీ వ్యక్తిగత విషయాలు ఎవ్వరితోనూ పంచుకోవద్దు. కుటుంబ సభ్యులతో చర్చించకుండా ఏపనీ తలపెట్టవద్దు.


వృశ్చికం


వృశ్చిక రాశివారు అతిమంచితనం తగ్గించుకుంటే మంచిది. లావాదేవీల విషయంలో ఎవ్వరికీ హామీ ఇవ్వొద్దు. ఎంత కష్టం ఉన్నా చేపట్టిన పని అనుకున్న సమయానికి పూర్తిచేయగల సామర్థ్యం మీకు ఉంటుంది. ఉద్యోగస్తులకు కలిసొచ్చే రోజిది. వ్యాపారంలో లాభాలు వచ్చే సూచనలున్నాయి. పాజిటివ్ గా ఆలోచించండి…చెడు ఊహలు వద్దు. ఓ పెద్ద సమస్య నుంచి బయటపడతారు.


ధనస్సు


ధనస్సు రాశివారికి అనకూల సమయం. ఈరోజు ఓ శుభవార్త మిమ్మల్ని ఆనందంలో ముంచెత్తుతుంది. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. వ్యాపారస్తులు సమస్యలు అధిగమిచి ముందడుగేస్తారు.


Also Read: స్థిరంగా పసిడి ధరలు.. దిగొచ్చిన వెండి.. మీ ప్రాంతాల్లో తాజా రేట్లు ఇలా..


మకరం


మకరరాశివారికి ఈ రోజు పెద్దగా బాగాలేదు. ఇంటా బయటా అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులు, స్నేహితుల కారణంగా కొంత మానసిక ప్రశాంతత ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఖర్చులును నియంత్రించండి. విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలున్నాయి.


కుంభం


కుంభ రాశివారు గతంలో నిలిపేసిన పనులు ఇప్పుడు పూర్తిచేస్తారు. తల్లిదండ్రుల సహకారంతో ముందడుగేస్తారు. ఉద్యోగంలో ఇబ్బందులు తప్పదు. వ్యాపారంలో లాభాలొచ్చే సూచనలున్నాయి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది.


మీనం


మీన రాశివారు ముఖ్యమైన పనులన్నీ పూర్తిచేసేస్తారు. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. వ్యాపారస్తులు, విద్యార్థులు, ఉద్యోగులు అందరకీ శుభసమయమే. స్నేహితులతో ఉన్న మనస్పర్థలు తొలగిపోతాయి.


Alos Read: విరాట్ కోహ్లీ మరో కీలక నిర్ణయం.. ఆర్సీబీ కెప్టెన్సీకి గుడ్ బై.. ఇదే చివరి సీజన్